ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే జన ప్రవాహమే అన్న విషయాన్ని ఎన్నోసార్లు నిరూపించారు. అయితే గతంలో అయితే తను ఎలాంటి సభలు పెట్టిన కూడా గ్రాఫిక్స్ అని డబ్బులు ఇచ్చి తీసుకువస్తున్నారనే విధంగా మాట్లాడడం జరిగింది ఇతర పార్టీ నేతలు కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అలాంటివేమి చేయాల్సిన పనిలేదు.. తాజాగా విరుకొండలో కార్యకర్తను ఉద్దేశపూర్వకంగా చంపిన విషయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా వినుకొండకు వెళ్లేటప్పుడు రకరకాల అవరోధాలు ఎదురయ్యాయి.



ఇక ఏపీ ప్రభుత్వం తన వెంట పెద్ద కాన్వాయ్ ఉండాల్సిన అవసరం లేదని.. చాలామందిని ఆపేశారు. లేకపోతే వందలాది వెహికల్స్ తో తన వెంట వెళ్లేవారట. జగన్ ను అయితే ఆపలేదు.. ఆ విషయంలో పోలీసులు పక్షపాతం వహించలేదని చెప్పవచ్చు.. మరొక అంశం ఏమిటంటే బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు.. ఇది ఒక డొకోట లాంటి కారు.. ఎక్కడ ఆగిపోతుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో తెలియడం లేదట. గతంలో బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే వెళ్లడు సెక్యూరిటీ లేకుంటే వెళ్లడు అనే విషయాలని చాలామంది ఎద్దేవా చేసేవారు.



ఇలాంటి వాటి అన్నిటినీ వదిలేసి ఇతర వెహికల్స్ లో  జగన్ మోహన్ రెడ్డి వెళ్లారు.. ఆ సమయంలో జనం ఎక్కడికక్కడ గ్యాదర్ అయి వాళ్లంతా వాళ్ళే.. తమ ప్రియతమ నేత జగన్  వస్తున్నాడని తెలిసి జనం రోడ్ల మీదికి రావడం అన్నటువంటిది వైఎస్ఆర్సిపి అభిమానులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి అంశం  అని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ ఆగి ప్రజలను దండం పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఒకటి సినీ గ్లామర్ మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.. మరొకవైపు పొలిటికల్ గ్లామర్ జగన్ కు పొలిటికల్ గ్లామర్ ఇంకా పోలేదని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు.. 11 సీట్లకే పరిమితమయ్యారు కాకపోతే 40% ఓటింగ్ షేర్ వచ్చింది.. ఓటమిపాలు అయ్యారు అయినా కూడా జనాధారణ అయితే తగ్గలేదు అనడానికి నిన్నటి రోజున జరిగిన రోడ్డు యాత్రలో భాగంగా జనాలను చూస్తే అర్థమవుతుంది. ఈ జనమంతా కూడా వాళ్లంతట వాళ్లే తెలుసుకొని మరి వచ్చేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: