ఆ సమయంలో వర్మకు కచ్చితంగా ఏదో ఒక పదవి ఇస్తారని కూడా అందరూ అనుకున్నారు. ఇప్పటివరకు అలాంటి హామీ ఏ మాత్రం నెరవేర్చలేదు. దీంతో వర్మ వర్గయులలో కాస్త నిరాశ మొదలైంది. పవన్ కళ్యాణ్ గెలవడంతో పిఠాపురంలో కాస్త జనసేన అభిమానులు ఆధిపత్యం ఎక్కువగా చూపిస్తూ ఉండడంతో ఇలాంటి సమయంలో తన రాజకీయ ఉనికి పెంచుకునేందుకు వర్మ మరొక అడుగు ముందుకు వేసినట్లుగా తెలుస్తోంది. వీటి కంటే ముందుగా పవన్ కంటే భారీ మెజారిటీతో వర్మ గతంలో గెలిచారు. అది కూడా ఇండిపెండెంట్గా గెలవడం జరిగిందట.
ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో తన పట్టు కోల్పోకూడదు అని వర్మ అన్న క్యాంటీన్ ని ముందుగానే ప్రారంభించేసారట. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ని ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రారంభించాలనుకున్నారు.అలాగే పిఠాపురంలో డొక్కా సీతమ్మ పేరుతో కొన్ని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ పిఠాపురంలో మొదటి అన్న క్యాంటీన్ ని ప్రారంభించడం ద్వారా వర్మాదే పొలిటికల్ పరంగా పై చేయి అన్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే ఇది జనసేన నేతలకు కాస్త జలక్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు. పిఠాపురంలో వర్మ కాఫ్యా ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టారు. వర్మ ఇది తన సొంత ఖర్చుతో ప్రారంభించినట్లు తెలుస్తోంది. టిడిపి కార్యకర్తలు వర్మ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. పేదలకు తిండి పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని కూడా సమర్థిస్తున్నారు.