* విడతల వారిగా రుణమాఫీ చేసిన కేసీఆర్‌
* లక్ష రుణమాఫీతో పాటు రైతుబంధు, రైతు భీమా అమలు
* రేవంత్ లాంటి ప్రకటన కేసీఆర్‌ చేసుంటే బీఆర్‌ఎస్‌ దే అధికారం


2004 సంవత్సరంలో... కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన వైయస్  రాజశేఖర్ రెడ్డి తర్వాత... రైతుల పట్ల దేవుడిగా మారారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ తీసుకువస్తే... కెసిఆర్ రుణమాఫీ తో పాటు... రైతుబంధు అలాగే రైతు బీమా కూడా అమలు చేసి... రైతుల పాలిట దేవుడిగా మారారు. అంతేకాదు ఈ పథకాలు దేశవ్యాప్తంగా... అమలు చేసేలా... అందరికీ స్ఫూర్తిని ఇచ్చారు కేసీఆర్.


అయితే అలాంటి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాకుండా 2014లో ముఖ్యమంత్రిగా... బాధ్యతలు తీసుకున్నారు. అయితే...  2014 సంవత్సరంలో.. రైతులందరికీ లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అప్పుడు రైతులంతా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై ప్రశంసలు కురిపించారు. అదే నమ్మకంతో 2019 ఎన్నికల్లో కూడా... ఉద్యమ పార్టీకి అధికారం అందించారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు.


అయితే 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. కరోనా, నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రభుత్వం పైన పడింది. దీంతో విడతల వారీగా... రుణమాఫీ చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దాదాపు లక్ష రూపాయల వరకు ఉన్న రైతులందరికీ... అప్పు కట్టేశారు. కానీ ఒకేసారి మాత్రం రుణమాఫీ చేయలేకపోయారు కేసీఆర్. దాంతో 2023 ఎన్నికల్లో.. కెసిఆర్ ఓడిపోవడం జరిగింది.


ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి... ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ అని  ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత... కెసిఆర్ దాంట్లో 30% కూడా ఇవ్వలేకపోయారు.  అంటే ఇక్కడ రైతులు తీవ్రంగా మోసపోయారన్నమాట. కెసిఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో రెండు లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఉంటే... కచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రి అయి రికార్డు సృష్టించేవారు. కానీ అలా చేయకుండా కేసీఆర్... తెలంగాణ బడ్జెట్ ప్రకారం.. రుణమాఫీ ఒకేసారి చేయలేమని తేల్చి చెప్పేశారు. దీంతో తెలంగాణ రైతన్నలు... కన్నెర్ర చేసి ఇప్పుడు బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR