* రుణమాఫీ తెచ్చిన రియల్ హీరో వైఎస్‌ఆర్
* రుణమాపీ, ఉచిత కరెంట్ తీసుకొచ్చి రైతులకు తగ్గిన భారం
* పాదయాత్ర చేసిన రుణమాఫీపై ప్రకటన
రైతు రుణమాఫీ... ఆ మాట వినగానే మొట్టమొదటగా అందరికీ గుర్తుకు వచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఈ... రుణమాఫీ పథకాన్ని తీసుకువచ్చి.. దేశ చరిత్రలోనే... ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఈ... రుణమాఫీ పథకాన్ని తీసుకు రాకపోయి ఉంటే.. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. స్వతహాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి... ఒక రైతు కాబట్టి.. ఈ పథకాన్ని తీసుకువచ్చారు.
2004 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులను... పీల్చి పిప్పి చేసిందని అప్పట్లో.. చాలామంది అనేవారు. కరెంటు బిల్లులు , అప్పులు, పెట్టుబడి సహాయం లేక చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకునేవారు. అలాంటి సమయంలోనే 2004 సంవత్సరంలో... పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అప్పటివరకు కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకునే సమయానికి... ఆ పార్టీకి వైయస్సార్ రూపంలో ఒక ఊపిరి వచ్చింది.
ఇక ఎన్నికల హామీలో భాగంగా... రైతులకు ఉచిత కరెంటు అలాగే రుణమాఫీ పథకాన్ని.. అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం కూడా.. వీటిపైనే చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. దీంతో 2004 సంవత్సరం నుంచి ఇప్పటివరకు... ఈ రుణమాఫీ పథకం అమలులోనే ఉంది. ఈ పథకం ద్వారా చాలా మేరకు రైతులకు న్యాయం జరుగుతుంది.
రైతులు అప్పుల బారిన పడకుండా కాపాడుతుంది. పాస్ పుస్తకాలు పెట్టి తమకు అవసరం ఉన్నంత అప్పు తెచ్చుకుంటున్నారు రైతులు. ఇక ఏపీ అలాగే తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా రుణమాఫీ మాత్రం కచ్చితంగా చేస్తున్నాయి. దీంతో రైతులు కాలర్ ఎగరవేసి... తిరుగుతున్నారు. అలా 2004 సంవత్సరంలో వైయస్సార్ తీసుకువచ్చిన రుణమాఫీ పథకం... పెను సంచలనంగా మారి దేశవ్యాప్తంగా... అందరికీ ఆదర్శప్రాయంగా మారింది.