తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతుల రుణమాఫీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అంటూ హామీ ఇచ్చారు  ఇక ఇచ్చిన హామీల నెరవేర్చే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకకాలంలో ఏకంగా రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఇటీవల ఏకంగా లక్ష మేరకు రుణమాఫీ ప్రక్రియను కూడా ప్రారంభించారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నో రోజులుగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతుల కళ్ళల్లో ఆనందం వెళ్లి విరిసింది.


 గతంలో 15 ఏళ్ల క్రితం దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టుగానే.. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏకకాలంలో రుణమాఫీ చేయడం గమనార్హం. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రుణమాఫీ చేసిన నేపద్యంలో ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రుణమాఫీ చేయాలి అంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే  గతంలో 2014లో అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీని ఏకకాలంలో చేస్తానని హామీ ఇచ్చి చంద్రబాబు మాట తప్పారు. సంవత్సరానికి 25000 చొప్పున రుణమాఫీ చేస్తూ వచ్చారు. అయితే అప్పుడు రైతుల ఆగ్రహమే తర్వాత వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబును ఓడించింది. ఇక ఇప్పుడు సుమారు 2,45,554 రూపాయల రుణం రాష్ట్రంలోని ప్రతి రైతు నెత్తి మీద కత్తిలా  వేలాడుతోంది. గడచిన దశాబ్ద కాలంలో కరువు తుఫానులతో రాష్ట్ర వ్యవసాయం సర్వనాశనం అయింది. దీంతో  ఒక్కసారిగా రైతులు మరింత కష్టాల్లో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు రుణమాఫీ విషయంలో మునుపటిలా మాట తప్పితే మాత్రం వచ్చే ఎన్నికల్లో రైతులు మరోసారి చంద్రబాబుకు బుద్ది చెప్పే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sbn