ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత.. వైసీపీ నేతలను.. టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వైసిపి కీలక నేతలపై కేసులు కూడా పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇటు వైసిపి కార్యాలయాలపై కూడా... దాడులు చేయడం జరుగుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు.


ఆ తర్వాత వైసీపీలో ఉన్న కీలక నేతలపై కేసులు పెడుతూ ముందుకు వెళుతున్నారు. అయితే... జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న రాజ్యసభ సభ్యులు vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి పై... సంచలన ఆరోపణలు ఇటీవల వచ్చాయి.  దేవాదాయ శాఖలో పని చేసే శాంతి అనే మహిళ ప్రెగ్నెంట్ కు కారణం విజయసాయిరెడ్డి అని.... ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. అయితే దీనిపై విజయసాయిరెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.


అయితే ఈ సంఘటనపై జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ సాయి రెడ్డికి ఈ విషయంలో అసలు సహాయం చేయకూడదని... అనుకుంటున్నారట. ఎందుకంటే విజయ సాయి రెడ్డి తన ప్రెస్ మీట్ లో... తన  పైన కుట్రలు చేసేది వైసిపి నేతలే అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. అలా చేయడం వల్ల వైసీపీ పార్టీ మరింత దెబ్బతినే...  ప్రమాదం ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారట.


విజయ్ సాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో...  ఆయన పార్టీ మారే ఆలోచన ఉన్నట్లు అందరూ చర్చించుకుంటున్నారట. ఇక ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసినట్లు సమాచారం. దీంతో వెంటనే విజయసాయిరెడ్డి పై వేటు వేయాలని... జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏ క్షణమైనా విజయసాయిరెడ్డిని... పార్టీ నుంచి సస్పెండ్ చేసే ప్రమాదం కూడా ఉందట. ఒకవేళ ఇదే జరిగితే.. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి  బిజెపి పార్టీ లోకి వెళ్తారని... తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: