ఇపుడు ఎక్కడ విన్నా మన తెలుగింటి ఆడబిడ్డ ఉషా చిలుకూరి పేరే వినబడుతోంది. అవును, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక అయిన నాటినుండి ఆమె పేరు ప్రపంచ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. జేడీ వాన్స్ భార్య అయినటువంటి ఉషా చిలుకూరి పూర్వీకులది వడ్లూరు. ఈ గ్రామం వెస్ట్ గోదావరి, ఉండ్రాజవరం పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామం గోదావరి కాలువను ఆనుకుని ఉండే ఓ ఆకుపచ్చటి పల్లె. 5 వేల జనాభా కలిగిన ఈ వడ్లూరు మౌలికవసతులతో, వరి పంటలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. ఇక్కడ సమశీతోష్ణస్థితి చాలా నిలకడగా ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి తోటలు విరివిగా కనిపిస్తుంటాయి. ఈ గ్రామం ఒక్కటే పంచాయితీ పరిధిలో ఉంటుంది కాబట్టి.. చూడడానికి పల్లె అయినప్పటికీ... మధ్యలో నుంచి వెళ్లే తారు రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా ఉన్న పాత – కొత్త ఇళ్లు, కాస్త ఇరుకుగా ఉండే సందులో పెద్ద పెద్ద ప్రాంగాణల్లో కట్టుకున్న ఇళ్లతో సందడిగా కనిపిస్తుంది.

నిజానికైతే ఈ గ్రామంలో ఎవరికీ ఉషా చిలుకూరి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే చిలుకూరి ఇంటి పేరుతో ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరూ లేకపోవడం కొసమెరుపు. ఆ కుటుంబంలో సుబ్రమణ్య శాస్త్రి అనే వ్యక్తి మాత్రం ఆ గ్రామంలోని వారికి కొంతమందికి బాగా తెలుసు. ఆ సుబ్రహ్మణ్యశాస్త్రి అన్న మనవరాలే మన ఉషా చిలుకూరి. అయితే వారి కుటుంబం మొత్తం ఆమె చిన్నప్పుడే యూఎస్ లో స్థిరపడిందని సమాచారం. అయితే ఆమె అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది అనే విషయం తెలిసినప్పటినుండి వడ్లూరు టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఈ విషయం ఆనోటా, ఈనోటా చేరి ఆఖరికి వడ్లూరి ప్రజలకు చేరడంతో 'ఈ ఊరి ఆడపడచు కుటుంబం అమెరికా రాజకీయాల్లో పాత్ర పోషించడం సంతోషకరం' అని గ్రామ పెద్దలు, చిన్నలు పండగ చేసుకుంటున్నారు.

ఉషా చిలుకూరి తాత రామశాస్త్రి కుటుంబానికి బంధుత్వం ఉన్నట్టు ఆ గ్రామానికి చెందిన ఓ బ్రాహ్మణ కుటుంబం తాజాగా ఓ మీడియాకు తెలిపింది. కానీ ఉషా చిలుకూరి గురించి కానీ, అసలు రామ శాస్త్రి పిల్లలు, మనువళ్ల గురించి కానీ వారికి అంతగా తెలియదు అన్నట్టు మాట్లాడారు. ఇకపోతే రామ శాస్త్రి, సుబ్రమణ్య శాస్త్రి ఇతర సోదరుల కుటుంబాలు మాత్రం కొన్ని హైదరాబాద్, బెంగళూరులో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ట్రంప్ తన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి పేరు ప్రకటించినప్పటి నుంచీ ఉషా కుటుంబం గురించి అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇపుడు ఆమె మూలాలు మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నందుకు మనవాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: