గత కొద్దిరోజుల నుంచి నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో 8 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసిన సంఘటన అందర్నీ భయభ్రాంతులకు గురి చేసింది. అయితే ఈ కేసులో రోజుకొక ట్వీస్ట్ బయటికి వినబడుతూనే ఉంది.. బాలిక మిస్సింగ్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించారు కొంతమంది అధికారులను కూడా ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. ముచ్చుమర్రి బాలిక కుటుంబాన్ని మంత్రులు పరామర్శించి బాలిక తల్లిదండ్రులను ఓదార్చి అనంతరం 10 లక్షల రూపాయలు చెక్కును కూడా అందించారు.


ముఖ్యంగా సొంతింటి నిర్మాణం పిల్లలు గురుకుల పాఠశాలలో చదివేందుకు అవకాశం కల్పిస్తామని కూడా తెలియజేశారు.. ఇంకోవైపు బాలిక మృతదేహం కొరకు గాలి ఇస్తున్నాం అనే విధంగా పోలీసులు తెలియజేశారు. అయితే ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఈ నెల 7వ తేదీన మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులైతే కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మొదట మృతి దేహాన్ని పూడ్చి పెట్టారని.. ఆ తర్వాత కెనాల్ గట్టుపై పడేసామంటూ తెలియజేశారు.


ఇలా అనేక రకాలుగా విషయాలు చెప్పినప్పటికీ.. చాలామంది ప్రజలు ఇలాంటి నిందితులకు కఠినమైన శిక్ష విధించాలంటు చాలామంది తెలియజేస్తున్నారు. చాలామంది వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేపడుతూ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా నంద్యాలలో మోహన్ అనే 35 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పదంలో మృతి చెందారు. అయితే ఈ వ్యక్తి ముచ్చుమర్రి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ వ్యక్తి ఆ బాలిక పైన అత్యాచారం చేసి హత్య కేసులో మోహను పోలీసులు విచారించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో  మోహన్ ఆత్మహత్య చేసుకున్నారా..? మరి ఏమైనా జరిగిందా అనే విషయాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. మృతి దేహాన్ని కృష్ణ నదిలో పారివేసిన నిందితులలో మోహన్ కూడా ఒకరి తండ్రిగా తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎన్ని ట్విస్టులు కనిపిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: