వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వారానికి రెండు మూడు సార్లు రోజా కొంతమందిని వేసుకొని దర్శనానికి వెళుతూ ఉండేది.. మరి కొంతమందిని కొన్నిసార్లు ఒకే లెటర్ మీద కొన్ని వందల మందిని తీసుకొని వెళుతూ ఉండేదట. ఈ విషయాలన్నీ ఇటీవల చాలామంది నేతలు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ ఛానల్ లో వార్తాపత్రిక ఒక న్యూస్ ప్రజెంటేషన్ చేసింది.. చంద్రగిరి ఎమ్మెల్యే పులపర్తి నాని.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు..



ఉదయం వీఐపీ విరామ సమయంలో పాల్గొన్న ఆయన తనకోసం ఎన్నికలలో పనిచేసిన 300 కు మందికి పైగా శ్రీవారి బ్రేక్ దర్శన భాగ్యాన్ని కలిగించారు. దీనికోసం ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేల సిఫారసు లేకుండానే ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. దీని మధ్య టిటిడి వర్గాలలో చర్చ సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకేసారి ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోయినా ఇంతమంది ఒకే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యే అనుచరులను లోపలకి పంపించడం ఎలా కేటాయిస్తారు అంటూ శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు.. ఒకవేళ లెటర్లు తీసుకొని ఆయన చేస్తే తప్పులేదు.. ఒక లెటర్ మీద కేవలం 6 మంది లేదా పదిమందికి మాత్రమే అవకాశం ఉంటుంది.


ఆలేఖన ఆయన 30 మంది ఎమ్మెల్యేల లెటర్ సేకరించారంటే అది సిన్సియర్గా ఉన్నారని చెప్పవచ్చు.. అదే సందర్భంలో అంతంతమందిని ఎందుకు తీసుకువెళ్తారని ప్రశ్నించిన వారి విషయానికి.. గతంలో కూడా రోజా తీసుకువెళ్లడం లేదు కూడా ఇలాగే అని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. తన నియోజకవర్గంలోనే కాకుండా తనతో ఉండే వారిని కూడా శ్రీవారి దర్శనం కోసం తీసుకు వెళ్తూ ఉండేది రోజా.. మామూలు దర్శనం వేరు బ్రేక్ దర్శనం వేరు అన్నట్లుగా తెలుస్తోంది.. అప్పుడు రోజా చేసింది కరెక్టే ఇప్పుడు ఈయన చేసింది కూడా కరెక్టే.. అప్పుడు విరుద్ధంగా అని రాసిన వార్తాపత్రికలు ఇప్పుడు రోజా చేసింది ఈయన చేసింది ఒకటే అన్నట్టుగా తెలుపుతున్నారు. ముఖ్యంగా ఒక లేఖ వల్ల ఎంతమంది వెళ్లాలనేది టీటీడీ నిర్ణయమే తీసుకుంటుంది. ఇది ఏ రాజకీయానికి సంబంధించి ఉండదట. రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి మార్చినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: