అయితే తాజాగా శ్రీరెడ్డికి భారీ షాక్ తగిలింది. టీడీపీ నేతలు ఆపరేషన్ శ్రీరెడ్డి స్టార్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదవగా టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజు యాదవ్ శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో నివాసం ఉంటున్నారనే సంగతి తెలిసిందే.
తనపై నమోదైన కేసు గురించి శ్రీరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. టీడీపీ నేతలను అసభ్యకరంగా దూషిస్తూ శ్రీరెడ్డి కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆమెపై కేసు పెట్టారని భోగట్టా. విషపు ఆలోచనలు ఉన్న శ్రీరెడ్డి నేతల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి కామెంట్లు చేశారని శ్రీరెడ్డిని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్పాలని రాజు యాదవ్ కోరడం విశేషం. శ్రీరెడ్డి అరెస్ట్ అయితే మాత్రం సంచలనం అవుతుందని చెప్పవచ్చు.
వైసీపీ నుంచి శ్రీరెడ్డికి అధికారికంగా సపోర్ట్ అందడం కూడా సులువు కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీరెడ్డి వాడిన భాష ఆమెకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. సోషల్ మీడియా జనాలు సైతం జాగ్రత్తగా ఉండాలని ఇష్టానుసారం వ్యవహరిస్తే మాత్రం ఏదో ఒకరోజు ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. శ్రీరెడ్డికి కష్టాలు మొదలైనట్టేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.