* అసెంబ్లీ సమావేశాల రోజునే ఢిల్లీకి జగన్
* రషీద్ హత్య కేసును హైలైట్ చేసేందుకు జగన్ ప్రయత్నాలు
* ఢిల్లీ వేదికగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు స్కెచ్
* ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... రాజకీయాలు చాలా హాట్ హాట్. కొనసాగుతున్న నేపథ్యంలో... అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈనెల 22వ తేదీ నుంచి అంటే.. సోమవారం ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్... అయ్యన్నపాత్రుడు.. అసెంబ్లీ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
హోంశాఖ, అలాగే అసెంబ్లీకి సంబంధించిన అధికారులతో కూడా ఇప్పటికే చర్చలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో... అసెంబ్లీ సమావేశాలకు రాకుండా.. జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసిపి నేత రషీద్... సంఘటన రెండు రోజుల కిందట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో నేరుగా బెంగళూరు నుంచి వచ్చి మరి... రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి.
అయితే... దీనిపై యుద్ధాన్ని ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన కూడా విధించాలని డిమాండ్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయని... ఆరోపిస్తూ ఏపీలో రాష్ట్రపతి పాలన నిర్వహించాలని కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి. దీనిపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.