తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి  పై తాడిపత్రికి వస్తే పంచ ఊడదీసి కొడతానంటూ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటైన కౌంటర్ తో పెద్దారెడ్డి స్పందించారు.. అయితే ఇలా అన్న వెంటనే మరుసటి రోజు పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టారు.. అయితే బెయిల్ షూరిటీ ఇచ్చేందుకు తాడిపత్రి పోలీస్ స్టేషన్ కు పెద్దారెడ్డి వెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి తాడిపత్రి అల్లర్ల కేసులో హైకోర్టు తనకు శరత్తులతో కూడిన బెయిల్ ఇచ్చిందంటూ తెలియజేశారు.


హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా తనను తాడిపత్రిలోకి రానివ్వకుండా చేస్తున్నారంటూ తెలిపారు. ఎలాంటి శూరిటీలు ఇవ్వనని పోలీసు ఏం చేస్తారు చేసుకోమంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న మాటలను పెద్దారెడ్డి  తెలియజేయడం జరిగింది. పంచ ఊడదీసి కొడతానన్నారు.. ఏమైనా ఆయన ఆస్తులను కాజేసామా 87 వేల ఓట్లు తనకు వేశారని ఇంతమంది పెట్టుకొని తనను రానివ్వ పోవడానికి అతనేవరు అంటూ కూడా ప్రశ్నించారు. ముందుగా అతని అర్హత ఏంటో తెలుసుకోవాలని జెసి ప్రభాకర్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు పెద్దారెడ్డి.


తమ పైన చేసిన వ్యాఖ్యలకు తాము చూస్తూ ఊరుకోవడానికి అమాయకులం కాదని మీ ఇంటి దగ్గర వంట మనుషులు, డ్రైవర్లు కాదని జేసి నీ ఉద్దేశించి ఫైర్ అయ్యారు.తాడిపత్రిలో మరో పదిమంది పైన ఆంక్షలు ఉన్నప్పటికీ విచ్చలవిడిగా తిరుగుతున్నారని తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదని కూడా ఫైర్ అయ్యారు. తనకు కుటుంబ సభ్యులు ఉన్నారు జెసికి కూడా అలాగే కుటుంబం ఉన్నది కొడితే కొట్టించుకోవడానికి తాను అమాయకుడిని కాదంటూ ఫైరయ్యారు.. తన అన్నను చంపించావని తాను అలా బలి కావడానికి సిద్ధంగా లేనని కూడా ఫైర్ అయ్యారు తిరిగి ఇదే పరిస్థితి తెచ్చుకోవద్దంటూ జెసికి పెద్దారెడ్డి హెచ్చరించడం జరిగింది. తన ఊపిరి ఉన్నంతవరకు తాడిపత్రిలోనే ఉంటాను అంటూ పెద్ద రెడ్డి గాటుగానే స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: