- ప్రతిపక్ష హోదా లేని జగన్ మాట్లాడతారా.?
-అసెంబ్లీలో ఆయన మాటలు ఎలా ఉండబోతున్నాయి.
-ప్రభుత్వ తప్పులపై గర్జిస్తారా డీలా పడిపోతారా.?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదిరింది. మొత్తం 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసేసారు . దీంతో వీరు పాలన చేయబట్టి నెల రోజుల టైం కూడా గడిచింది.  ఇదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ప్రజా అభివృద్ధిపై దృష్టి పెట్టారు.  ప్రజా సమస్యలన్నీ తెలుసుకొని ఈసారి అసెంబ్లీలో వాటిపై మాట్లాడుకుని ఆ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. అలా  ఇదే తరుణంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.  


నిజానికి జగన్మోహన్ రెడ్డికి మాత్రం అసెంబ్లీలో అంతగా పట్టులేదు.  అంతేకాకుండా ఏం మాట్లాడినా ఆయన ఒక్కడే స్పందించాలి. ఆయనొక్కడే దేనికైనా ముందుకెళ్లడానికి రెడీ అవ్వాలి.  ప్రభుత్వ తప్పులను కూడా నిందించడానికి కేవలం అవగాహన ఉన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అని తెలుస్తోంది. ఎందుకంటే మిగతా గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది కొత్త వ్యక్తులే. అందులో పెద్దిరెడ్డి ఉన్నా, కానీ ఆయన బయట ఏదైనా వ్యవహారాలు చూసుకోగలుగుతాడు కానీ గట్టిగా అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తి కాదు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీలో ఏవిధంగా అదరగొట్టబోతున్నారు లేదంటే సైలెంట్ గా ఉంటాడా అనే వివరాలు చూద్దాం.
 
 టైగర్ లా గర్జిస్తాడా.?

గత కొన్ని వారాల క్రింద ఎమ్మెల్యేలు, మంత్రులంతా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి కేవలం ఐదు నిమిషాల్లో ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత బయటకు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది కౌరవసభ కాదని ప్రతి ఒక్కరికి మర్యాదగా గౌరవం అందిస్తామని, వైసీపీ ఎమ్మెల్యేల గౌరవాన్ని కాపాడతామని హుందాగా వ్యవహరిస్తామని తెలియజేశాడు. గత ఐదు సంవత్సరాలలో జగన్ టీం ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టినా కానీ టిడిపి కూటమి ఎమ్మెల్యేలు మాత్రం వైసిపి ఎమ్మెల్యేలతో హుందాగా వ్యవహరించారని చెప్పకనే చెప్పారు. ఇదే తరుణంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు ఈ సమావేశాలకు వస్తాడా? రాడా? అనే డౌట్ చాలా మందికి ఉండేది. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ తప్పనిసరిగా అసెంబ్లీకి రాబోతున్నాడని చెప్పేశారు. మరి అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కొత్తవారే కానీ జగన్ మాత్రమే ఏ విషయాన్ని అయినా ప్రశ్నించాలి, మాట్లాడాలి. ఇంతమందితో ఆయన కొట్టాడా గలుగుతారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ప్రజా సమస్యలపై కొట్లాడాలి అంటే ఒక్కరైనా చాలు పదిమంది ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ జగన్ ఈ నెలరోజుల పాలనపై కూటమి నాయకులు చేసే తప్పులపై పులిలా పంజా విసురుతారా లేదంటే జింకల డీలా పడిపోతారా అనేది ముందు ముందు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: