•కూటమితో జగన్ ఒంటరి పోరాటం..

•అసెంబ్లీలో సింహంలా గర్జిస్తారా..

•జగన్ వ్యూహాన్ని కూటమి పసిగట్టగలదా..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)


రేపు అనగా జూలై 22వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమావేశాలపై ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది...అంతేకాదు ఏ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి..?  ప్రస్తుతం ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి.. ? అటు ప్రజలకు ఇటు యువతకు ఎలాంటి మంచి చేకూర్చాలి ..? అనే విషయాలపై చర్చించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఆయా సమస్యలపై స్పందిస్తారా? లేక జగన్ పై తమ కుట్రను బయట పెడతారా? అనే విషయం ఇప్పుడు ప్రజలలో ఉత్కంఠగా మారింది.

ఇకపోతే సంక్షేమ పథకాలను నమ్ముకొని అధికారంలోకి రావాలనుకున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకంగా మారారు. ఏకంగా 175 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 11 సీట్లను మాత్రమే కట్టబెట్టారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు మాత్రం కూటమితో పొత్తు పెట్టుకుని ఈసారి ఎన్నికలలో నిలిచి ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకుని మరొకసారి చరిత్ర సృష్టించారు. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే అవమాన భారంతో వెనుతిరిగారు. ఆయన అక్కడ ఐదు నిమిషాలు కూడా ఉన్నట్టు కనిపించలేదు.

పూర్తిస్థాయిలో భంగపడ్డ జగన్మోహన్ రెడ్డి రెట్టింపు స్థాయితో తిరిగి వస్తారని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ ఏవిధంగా కూటమిని ఎదుర్కొంటాడు..?  కూటమి తనపై చేసే ఆరోపణలకు సింహంలా గర్జిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో గుంపుగా వస్తున్న కూటమిని సింహంలా ఎదుర్కొని.. మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని వైసిపి శ్రేణులు కూడా కోరుతున్నారు. మరి ఏ మేరకు కూటమి దెబ్బకు జగన్ నిలబడతారా లేక చతికిలబడతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: