న్యూట్రల్ ఓటర్ల మద్దతు సైతం సొంతమైతే మాత్రమే జగన్ పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉంటాయి. జగన్ కూటమిపై వచ్చే వ్యతిరేకతను క్యాష్ చేసుకునేలా సరైన ప్రణాళికలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. గతంలో వైసీపీ అధినేత జగన్ చేసిన తప్పులు ఏంటో పార్టీ ఎందుకు ఓడిపోయిందో ప్రజలు సైతం వెల్లడిస్తున్నారు. రాష్ట్రంలో అణువంతైనా అభివృద్ధి జరగలేదని చెబుతున్నారు.
రోడ్ల విషయంలో వైసీపీ చేసిన తప్పులకు ప్రతిఫలం అనుభవిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం జగన్ పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ తప్పులను విశ్లేషించుకుని సరికొత్త హామీలతో జగన్ ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే చేసిన తప్పులను పునరావృతం చేస్తే మాత్రం వైసీపీ భవిష్యత్తుకే ప్రమాదమని చెప్పవచ్చు.
వైసీపీ తెలివిగా, జగ్రత్తగా సరైన వ్యూహాలతో ముందుకెళ్తే మాత్రమే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు. వైసీపీ పొలిటికల్ కెరీర్ పుంజుకోవాలంటే మాత్రం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వైసీపీకే కార్యకర్తలే బలం కాగా వాళ్లకు అండగా నిలబడాల్సిన బాధ్యత సైతం జగన్ పై ఉందని చెప్పవచ్చు. జగన్ పొలిటికల్ వ్యూహాలతో శ్రద్ధ పెడితే రాబోయే రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. టీడీపీ తప్పులే వైసీపీకి శ్రీరామరక్ష అని చెప్పవఛు. వైసీపీ నేతలు టీడీపీకి ఛాన్స్ ఇవ్వకుండా తెలివిగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.