ఇది నిజమే. ఎందుకంటే.. డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా.. కాలేశ్వరం ప్రాజెక్టును కట్టిన కేసీఆర్ను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. మేడిగడ్డ కృంగిపోయింది, భారీ వరదలు వస్తే కూలిపోతుంది అని దుష్ప్రచారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు స్పెషల్ బస్సు పెట్టి మరి... ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లి మేడిగడ్డ బ్యారేజ్ ను చూపించారు. ఆ సమయంలో రెండు ఫియర్స్ కుంగాయి.
ఎన్నికల కంటే ముందు కూడా ఇదే విషయాన్ని బాగా హైలైట్ చేసి కాంగ్రెస్ విజయం సాధించింది.అయితే... కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు కూడా అన్నారు. ఇక కాంగ్రెస్ చెప్పినట్లుగానే భారీ వరదలు ఇప్పుడు గోదావరి గుండా వెళ్తున్నాయి. కానీ మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరడం లేదు. గోదావరి రెండు గట్లు పట్టుకొని పోతున్న వరదను మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకొని నిలబడింది. ఏమాత్రం చెక్కుచెదరకుండా.. నీళ్లను వదులుతోంది మేడిగడ్డ బ్యారేజ్.
అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని గులాబీ పార్టీ హైలెట్ చేస్తోంది. కాంగ్రెస్ దుష్ప్రచారానికి... మేడిగడ్డ బ్యారేజ్ సమాధానం చెప్పిందని కేటీఆర్ కూడా నిన్న వెల్లడించారు. త్వరలోనే కాలేశ్వరం వద్దకు వెళ్లి... తెలంగాణ ప్రజలకు.. నిజాలు చెబుతామని కేటీఆర్ ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిఫెన్స్ లో పడింది. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.