హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు అనేక రకాల వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా పేరున రెస్టారెంట్ ,హోటల్స్ ,పబ్బులు, బార్లు, పార్సిల్, స్ట్రీట్ వెండర్లు ఇతరత్రా వాటితో వేలకోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రుచిసరే కానీ శుభ్రత నాణ్యత వంటి విషయంలో రోజుకు ఒక వార్త వినిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా హోటల్స్ లో అపరిశుభ్రత కిచెన్లు.. చెడిపోయిన దినుసులు పాచిపోయిన సరుకులు రసాయనాలతో నిరంతరం వార్తలు వినిపిస్తూ ఉంటాయి. దీంతో తాము తింటున్నది ఇలాంటి భోజనమా అని ప్రజలు ఆశ్చర్యపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.


అయితే ఇలాంటివన్నీ చిన్న హోటల్స్ లోనే కాదు బడా హోటల్స్ సైతం తనిఖీలు చేసినప్పుడు ఇలాంటివి బయట పడుతూ ఉంటాయి. ఇలాంటిది రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా అన్నిచోట్ల కూడా ఒక ఉద్యమమే నడుస్తూ ఉన్నది. ఎప్పుడు అధికారులు తనకి చేస్తారో తెలియక హోటల్స్ హఠాత్తుగా శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఆర్వి కర్ణన్.. ఏప్రిల్ 16న ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాడు ప్యారడైజ్, బాహుబలి కిచెన్ ,పిస్తా హౌజ్, రాబిన్స్, రామేశ్వరం కేఫ్ ఇలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హోటల్స్ ఏవి కూడా వదలడం లేదట.


ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదట ఆర్వి కర్ణన్.. తన క్రమశిక్షణతో పని ఎలా చేయగలిగారో నిరూపించారు. ఎలాంటి ఒత్తిళ్లకు భయపడకుండా అవినీతి లేదని విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సపోర్టు చేయడంతో మరింత స్వేచ్ఛగా పనిచేస్తున్నారు ఆర్వి కర్ణన్. ముఖ్యంగా అక్కడ మంత్రి దామోదర రాజనర్సింహరావు ఫుల్ సపోర్ట్ చేశారట. ఫుడ్ సేఫ్టీ విషయంలో హైదరాబాద్కు ఉన్న పేరును సైతం నిలబెట్టాలని ఆ అధికారిని కోరారుట. అలా తన ఆదేశాల మేరకు తన పని చాలా నిక్కచ్చుతో పనిచేశారు ఆర్వీకర్ణన్.. ముఖ్యంగా తన టీమ్ లో ఏ ఒక్కరి నెంబరు కూడా ఎవరికీ తెలియనియకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ తనిఖీలు చేపట్టారు. అలాగే తను తనిఖీ చేసిన వివరాలను సోషల్ మీడియాలోనే పోస్ట్ చేస్తూ ఉండేవారు. మీడియా మొత్తం వాటినే ఫాలో అయ్యేవారట. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి అధికారి ఉంటే బాగుంటుందని ప్రజలు చాలా చోట్ల కూడా ఇలాంటి హోటల్స్ బండారాలు బయటపడతాయని ప్రజలు కూడా తెలియజేస్తున్నారు.ఈయన తమిళనాడులోని శివగంగా జిల్లా కరైకుడి .. 2007లో ఐఎఫ్ఎస్ టాపర్గా నిలిచారు.. 2012లో యూపీఎస్సీలో 158 ర్యాంకు సాధించారు. ఆ తర్వాత కొన్ని జిల్లాలలో కలెక్టర్గా కూడా పనిచేశారట. ఈయన తండ్రి లైబ్రరీ తల్లి సబ్ రిజిస్టర్.. ఏ కోచింగ్ లేకుండానే ఉద్యోగాన్ని అందుకున్నారు. ఈయన భార్య ప్రియాంక కూడా ప్రస్తుతం సర్వీసులోనే ఉన్నట్లు సమాచారం ఆమె కూడా ఐఏఎస్ అధికారి.

మరింత సమాచారం తెలుసుకోండి: