ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాజకీయం ఎంతవరకు..? ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె రాజకీయాలలో నెగ్గుకు రాగలుగుతారా..? ఆంధ్రప్రదేశ్‌లో అవ‌సాన‌ దశలో ఉన్న కాంగ్రెస్‌కు ఆమె నాయకత్వం తిరిగి జీవితాన్ని ఇస్తుందా..? అంటే కష్టమనే చెప్పాలి. ఎన్నికలకు ముందు వరకు షర్మిలకు మీడియా పరంగా కొంత కవరేజ్ దక్కింది. అందులోనూ షర్మిల కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తే వైసీపీ ఓటు బ్యాంకు చిల్లు ప‌డుతుందని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో పాటు.. తెలుగుదేశం పార్టీ అనుకూల సోష‌ల్ మీడియాను షర్మిలను బాగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు.


ఇక జగన్ తిట్టేంతవరకు.. జగన్ పాలనను ఏకేసినంతవరకు.. షర్మిలకు మీడియా ప్రాధాన్యం ఉంది. షర్మిల.. జగన్‌ను టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తే టీడ‌పీ, జనసేన, బిజెపి నుంచి కూడా సపోర్టు ఉంటుంది. ఆ గీత దాటి బయటకు వచ్చి కూటమి సర్కారుపై విమర్శలు ప్రారంభించిన తర్వాత ష‌ర్మిలను పట్టించుకునేవారు.. ఆమెకు లైవ్ ప్రసారాలు ఇచ్చేవారు.. ఆమె గురించి చర్చించేవారు ఉండరు కనుమరుగైపోతారు. ఎందుకంటే ఓ వర్గం మీడియా జగన్‌కు వ్యతిరేకంగా షర్మిలను బాగా ప్రోత్సహిస్తూ వచ్చింది.


షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఎంత డిజాస్టర్ షో చేసిందో మనమందరం చేసాం. తెలంగాణ లో ష‌ర్మిల రాజ‌కీయం మ‌రీ కామెడీ అయిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు ష‌ర్మిల కు ఉన్న ప‌రువు.. క్రేజ్ మొత్తం గంగ‌లో క‌లిసిపోయేలా చేసింది. చివరికి ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. తాను కూడా ఒక్క సీటు దక్కించుకోలేకపోయారు అంటే.. ఆమె పడిన కష్టం ఎంత వ్యర్థమైందో తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో షర్మిలకు జగన్‌తో ఉన్నన్ని రోజులు.. వైసీపీలో కొనసాగినన్ని రోజులు.. తిరుగులేని క్రేజీ ఉండేది. ఆమె రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా వైసీపీ నాయకులు వైసీపీ అనుకూల మీడియా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఇప్పుడు ఆమె జ‌గ‌న్‌కు దూర‌మయ్యాక ఆమె గ్రాఫ్ ప‌తాళంలోకి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: