ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపుగా 5 రోజులపాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి.. పగడ్బందీగా ఈ సమావేశాలను నిర్వహించేందుకు సైతం ప్రభుత్వము అధికారులతో సిద్ధమయ్యింది.. రేపు ఉదయం 8: 30 గంటలకు వెంకటపాలెంలో ఉండేటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత టిడిపి నేతలు అసెంబ్లీకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే ఒక రూల్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. ఈ విషయాన్ని టిడిఎల్సి సూచించింది.



ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతాయి .ఉమ్మడి సభలను సైతం ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు అందరూ కూడా పసుపు రంగు దుస్తులు కండువాలతోనే లోపలికి రావాలంటు సూచిస్తున్నారు. ఐదు రోజులు జరిగేట టువంటి సమావేశాలకు అలాగే హాజరుకావాలని తెలియజేశారట. అలాగే ఈ నెలాఖరి లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు కూడా ముగియనుంది మరో మూడు నెలలకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలు కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్ ని అక్టోబర్ నెలలో ప్రవేశపెట్టేలా డాన్స్ చేస్తుంది.


అక్టోబర్ 23న అసెంబ్లీ సమావేశాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్ట బోతున్నారట.. ముఖ్యంగా వైసిపి ప్రభుత్వ పాలన పైన ఇప్పటికే నాలుగు సీత పత్రాలను కూడా రిలీజ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మరో మూడు శ్వేత పత్రాలపైన శాంతిభద్రతలు మద్యం ఆర్థిక శాఖల అంశాల పైన కూడా పలు రకాల శ్వేత పత్రాలను విడుదల చేసే విధంగా చూస్తున్నారు. శ్వేత పత్రాలలోని అంశాల పైన ప్రస్తుతం చర్చలు ఎక్కువగా జరిపేలా ప్లాన్ చేస్తున్నారు కూటమి నేతలు. మరి జనసేన బిజెపి నేతలు ఎలాంటి కండువాలు వేసుకోవాలనే విషయం పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇలాంటి నిబంధనలను ఎవరైనా పాటిస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: