ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వినుకొండలో బిజీ రోడ్డుపై రషీద్ అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ షాకింగ్ సంఘటన భారతదేశ వ్యాప్తంగా చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతుడి కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ స్వయంగా కలుసుకోవడంతో ఈ హత్య రాజకీయ రంగును పులుముకుంది. దీని తరువాత, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రషీద్ హత్య గురించి పబ్లిక్ గా మాట్లాడారు. అయితే అలా మాట్లాడటం వల్ల అతను లేనిపోని చిక్కుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆయన రషీద్ గురించి మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఈ ఘటనపై అవినాష్ స్పందిస్తూ, రషీద్ హత్య ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వ అణచివేత పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. రషీద్ వైసీపీ కార్యకర్త అని పేర్కొంటూ హత్యకు రాజకీయ దురుద్దేశం ఉందని ఆయన అనుమానించారు. హత్యను ఖండిస్తూ అవినాష్ చేసిన వీడియో సోషల్ మీడియాలో కనిపించడంతో, అనేక ట్రోల్స్ ఒక్కసారిగా వెల్లువెత్తాయి.  

ట్విట్టర్ యూజర్లు అవినాష్ కు తన సొంత మామ వివేకా హత్యలో ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు ఒక మర్డరర్‌ మరో మర్డర్ గురించి మాట్లాడటం వ్యంగ్యంగా, హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. వివేకా హత్యకేసులో సీబీఐ విచారణలో ఉండగానే ఓ హత్యకేసు గురించి మాట్లాడటంలో అవినాష్ ధైర్యం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసిన వాళ్లే నీతులు చెబుతున్నారు. ఈ కాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది అని కొందరు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతను రషీద్ హత్య గురించి మాట్లాడటం చూస్తుంటే నవ్వు వస్తోందంటూ కామెంట్ చేస్తున్నారు.

నిజానికి అవినాష్ ఇప్పటిదాకా ఎలాంటి కేసులో అపరాధిగా తేలలేదు కాబట్టి అతనిపై ముద్దాయిగా ముద్ర వేయడం అనేది చాలా తప్పు. ఏది ఏమైనా అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ వారిని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్ కూడా చాలామందికి జోకర్ లాగా కనిపిస్తున్నారు. వచ్చే ఆయుధాల తర్వాత వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడు విమర్శించే వారే రేపు సైలెంట్ అయిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: