ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ని మళ్లీ లైట్ గా తీసుకుంటున్నారని ఆలోచనలు టిడిపి నేతలు మరొకసారి మొదలవుతున్నాయి.. చంద్రబాబు తాజాగా తన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్ర మంత్రులతో ఒక సమావేశంలో అనుసరించాల్సిన విధానాల గురించి కేవలం దిశా నిర్దేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ను డెవలప్మెంట్ దిశగా అడుగులు వేయించేలా చేయడమే కాకుండా ఈనెల 24న జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని ఈ ప్రస్తావనలో కూడా వినిపించింది.



ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఏం చేస్తారన్నది పట్టించుకోవాల్సిన పనిలేదని వైసిపి గురించి గానీ జగన్ గురించి ఎక్కువగా ఆలోచించొద్దండి రాష్ట్రం గురించి ఆలోచించండి అంటూ చంద్రబాబు తమ నేతలకు సూచన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రని అభివృద్ధి వైపుగా పనిచేయాలని జగన్ ధర్నాలు మనల్ని ఆపలేవు అంటూ కూడా తెలియజేశారట. ముఖ్యంగా మన కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం ఏమి చేస్తారన్న విషయమే ముఖ్యము అంటూ చంద్రబాబు సూచించారట. ప్రజలు అందించిన అధికారంతో మనం మేలు చేయాలి అని ఆ వైపుగాని అడుగులు వేయాలని చెప్పారట.



వినుకొండలో రషీద్ అనే కార్యకర్త హత్య తర్వాత జగన్ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఏపీలో శాంతిభద్రతలు ఏమాత్రం లేవంటూ కూడా ఆయన ఢిల్లీ నడిరోడ్డున ఆందోళన చేయబోతున్నట్లు తెలియజేశారు.ఒకవైపు పార్లమెంటు సమావేశాలు మరొకవైపు ఇలాంటి ఆందోళన చేయడం వల్ల కేంద్ర పేదల దృష్టికి ఏపీ సమస్యలు తీసుకురావాలన్నదే ఇప్పుడు జగన్ ఆలోచిస్తున్న వార్త అన్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తే మన వెంటే ప్రజలు ఉంటారని చంద్రబాబు ఆదారునిలో ఆలోచిస్తున్నారట. జగన్ ఎన్ని నిరసనలు తెలియజేసినా కూడా ఆ వైపు కూడా చూడరనే భావన ఇప్పుడు చంద్రబాబులో కనిపిస్తోంది. కానీ జగన్ తక్కువ అంచనా వేయడం చంద్రబాబు చేస్తున్న పొరపాటే అని మరి కొంతమంది నేతలు కార్యకర్తలు కూడా వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: