ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ప్రస్తుతం వంగలపూడి  అనిత ఉన్నారు.. తాజాగా హోం మంత్రి పైన పశ్చిమగోదావరి జిల్లాలో వైసిపి మహిళా నేత మాజీ హోంమంత్రి వనిత మాట్లాడుతూ అనిత చేసిన వ్యాఖ్యల పైన ఫైర్ అయ్యింది.. తమ నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన లేనిపోని ఆరోపణలు చేస్తోంది అంటు ఆమె వెల్లడించింది. అనిత మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ దాడులు జరుగుతూ ఉంటే హోంమంత్రి ఎందుకు స్పందించలేదంటూ ఆమె నిలదీయడం జరిగింది.



అనిత కూడా ఎమ్మెల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మెల్యేగా గెలిచే సీఎం అయ్యారని పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని.. వారి పని వారు చేసుకోవాలని కూడా తెలియజేసింది. టిడిపి నేతలు చేస్తున్న ఈ దాడుల వల్ల తమ పార్టీ నాయకులపైనే కేసు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆంధ్రాలో శాంతిభద్రతలపై తమ అధినేత ఢిల్లీకి వెళ్తే తాను కూడా అక్కడికి వెళ్లి తేల్చుకుంటారు మంత్రి వంగలపూడి అనిత  అనడం  కాస్త హాస్యాస్పదంగా మారింది.


వైయస్ వివేకానంద హత్యతో పాటు గత వైసిపి ప్రభుత్వంలో ఆంధ్రాలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నానంటూ ఒక సవాల్ని విసురుతోంది హోం మంత్రి వంగలపూడి అనిత.. ఇలాంటి సమయంలోనే వనిత ఒక కౌంటర్ వేయడం కూడా జరిగింది. అయితే ఆంధ్రాలో శాంతిభద్రతలు తగ్గు ముఖం పట్టాయని చాలామంది నేతలు కామెంట్స్ చేస్తున్నారు.. దీంతో ఇటీవలే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా గవర్నర్తో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న హత్య రాజకీయాలను ఏపీలో 45 రోజులుగా జరిగిన హత్యాదాడుల పైన కూడా గవర్నర్ కి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ అరాచక పాలన పైన కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అందుకు సంబంధించిన ఆధారాలను కూడా గవర్నర్కు సమర్పించినట్లు తెలుస్తోంది. మరి వీటి పైన కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: