* ఆడుదాం అసెంబ్లీ(లో) అంటున్న జగన్ !

        * అసెంబ్లీలో ఎక్కడ కూర్చోవాలో తెలియని స్థితిలో జగన్ ?
 
        * జగన్ సైన్యంలో ఎక్కువమంది జూనియర్లే..!

(అమరావతి-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం 164 సీట్లు సాధించి భారీ విజయాన్ని కైవసం చేసుకొని వైసీపీకు 11సీట్లకే పరిమితం చేసింది.దాంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నకు లేఖ రాసారు. కానీ దానిపై ఇప్పటిదాకా ఎటువంటి అప్డేట్ లేదని తెలుస్తుంది.గత నెలలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి జగన్ వస్తారా? రారా? అనే అంశం అప్పట్లో బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఆరోజు జగన్ అసెంబ్లీకి వచ్చి తన ప్రమాణస్వీకారం కంప్లీట్ ఐనా వెంటనే పులివెందులకు వెళ్లిపోయారు. ఈరోజు నుండి రెండవ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి, అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది.సమావేశంలో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ నజీర్ శాసనసభ, మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశానికి సభ్యులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆహ్వానించానున్నారు.ఈ సమావేశాలకు తన 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో ముఖ్యంగా మాజీ సీఎం జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.అయితే ఇటీవల ఒకానొక సందర్భంలో జగన్ స్వయంగా అసెంబ్లీ వేదికగా కూటమి ప్రభుత్వంతో అమితుమీ తేల్చుకోవడంతో పాటు రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చించేందుకు సిద్ధమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టం చేసింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై..శాసనసభ వేదికగానే ప్రశ్నిస్తామని వైసీపీ ప్రకటించింది. అందులో భాగంగానే శాసనసభ సమావేశాలకు హాజరై తమ గొంతును వినిపించేందుకు వైసీపీ అధినేత తన ఎమ్మెల్యేలతో కలిసి సిద్ధమవుతున్నారు.అయితే అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహారించాలని భావిస్తున్నారు జగన్ .

రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ నేతలు-శ్రేణులపై జరుగుతున్న దాడులపై అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్‌ భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను అసెంబ్లీలో గవర్నర్ ముందు వివరించాలని వైసీపీ భావిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గవర్నర్‌ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే నిరసన తెలపాలని వైసీపీ అధినేత డిసైడ్‌ అయ్యారు. దాడులకు నిరసనగా గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై దిల్లీలో ధర్నా చేస్తానని ప్రకటించారు. అలాగే ఎన్నికలప్పుడు చెప్పిన హామీల గూర్చి కూడా జగన్ డిమాండ్ చేయాబోతున్నట్లు తెలుస్తుంది.అయితే జగన్ సైన్యంలో ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరిద్దరు మినహా అందరు జూనియర్లే అని చెప్పాలి.దీంతో కూటమి పార్టీ నేతల నుంచి వచ్చే కామెంట్స్‌కు జగన్‌ ఏ విధంగా కౌంటర్‌ ఇస్తారన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు వైసీపీలా కాకుండా హుందాగా రాజకీయాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు సీఎం చంద్రబాబు. దీంతో కూటమి ఎమ్మెల్యేలు జగన్‌పై పరిధి దాటి విమర్శలు చేయకుండా చూడాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంది.దాంట్లో భాగంగానే అసెంబ్లీలో అసలు జగన్ ను పట్టించుకోకుండా కూటమి తన ఆలోచనలో భాగంగా 23వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గత వైసీపీ పాలన తీరుపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు మరో మూడు పత్రాలను అసెంబ్లీ సమావేశంలో విడుదల చేయనున్నారు.శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తుతో ఉన్న కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.తన సైన్యంతో యుద్దానికి 'సిద్ధం' అంటున్న జగన్ అసెంబ్లీలో తన యొక్క నడవడిక బట్టి రేపు ఆయనకు కూటమి నాయకులు ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: