ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సారి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తాడా రాడా అనే అనుమానాలు జనాలలో బలంగా రేకెత్తాయి. కాకపోతే జగన్ రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కచ్చితంగా హాజరు కాబోతున్నట్లు వై సి పి వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఇకపోతే జగన్ దాదాపుగా తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత నుండి జరిగిన దాడులపై చాలా గట్టిగా మాట్లాడే అవకాశాలు బలంగా ఉన్నాయి.

ఇక ఆ మాటల ద్వారా తెలుగు దేశం పార్టీ కి , కూటమి కి గట్టి గానే కౌంటర్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వరకు ఓకే కానీ ఒక వేళ కూటమి సభ్యులు కనుక వై సి పి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేయలేక పనుల చేయలేకపోయిన పనలను తెర పైకి తీసుకు వస్తే మాత్రం ఆది జగన్ కి కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉంది. ఉదాహరణకు రోడ్ల విషయం కానీ , ఇంకేమైనా ప్రగతి విషయాల గురించి కానీ జగన్ మాట్లాడే అవకాశాలు పెద్దగా లేవు. ఎందుకు అంటే ఆఖరి ఐదు సంవత్సరాలు వైసీపీ పార్టీ అధికారంలో ఉంది.

దానితో ఆయన వాటి గురించి మాట్లాడితే మీరు ఐదు సంవత్సరాలు ఏమి చేశారు. మేము అధికారంలోకి వచ్చి నెల రోజులే అవుతుంది అప్పుడే మమ్మల్ని అడుగుతున్నారా అని అధికార పక్షం ప్రశ్నించే అవకాశం ఉంది. వాటి ద్వారా జగన్ చిక్కుల్లో పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఆయన కేవలం తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వై సి పి శ్రేణులపై జరిగిన దాడులపై , వారి ఆస్తుల ధ్వంసం పై మాత్రమే చర్చించే అవకాశం చాలా వరకు ఉంది. మరి జగన్ అసెంబ్లీ లో ఏ స్థాయిలో తన మాటల దాడితో ప్రత్యర్ధులను దాడి చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: