- ఏపీలో స్టార్ట్ అవుతున్న సమరం..
- ఓవైపు అధికారపక్షం మరోవైపు ప్రతిపక్షం..
- మొదటి అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి..

 సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు  చాలా రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు అధికారపక్షం మరోవైపు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ ప్రసంగంతో మొదలయ్య అసెంబ్లీ సమావేశాలు ఆ తర్వాత ఏ మలుపు తిరుగుతాయోనని  ఏపీ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అద్భుతమైన మెజారిటీతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కేవలం 11 సీట్లకే పరిమితమైనటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఢీ కొడుతుంది అనేది చాలా ఆసక్తి రేపుతోంది.. అయితే మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరు కారని అనుకున్నారు. కానీ వాటి అన్నింటికి చెక్ పెడుతూ జగన్ పులిలా అసెంబ్లీకి వస్తారు.ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి  వార్తలు వచ్చాయి. బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కూటమి ఇచ్చిన హామీలపై సభా వేదికగానే జగన్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి తాజా రాజకీయ పరిణామాలు,వైసిపి నేతలు, శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్  ముందు ప్రతిపాదించే అవకాశం ఉంది.
 
 వినుకొండ ఘటన:
 వినుకొండ పట్టణంలో రాత్రి 8 గంటల సమయంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ పై  టిడిపి నాయకుడు అయినటువంటి జిలానీ మరణాయుధాలతో దాడి చేసి నడిరోడ్డుపై హత్య చేయడం సంచలనంగా మారింది. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.  బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించి వెంటనే వినుకొండకు చేరుకొని రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. వైసిపి కార్యకర్తలంతా రషీద్ కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని,


 టిడిపి నాయకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని,ఇలా అయితే రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుందని అన్నారు.  అంతేకాకుండా దీనిపై అసెంబ్లీ నిండు సభలో ప్రశ్నిస్తానని గవర్నర్ ముందు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు. అంతేకాకుండా ఇదే విషయమై ఢిల్లీలో మా ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విధంగా జగన్ అన్న మాటలు వింటే మాత్రం ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వినుకొండ ఘటనపై ఏ విధంగా  ప్రశ్నిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: