-జగన్ మాట కోసం రాష్ట్రమంతా ఎదురుచూపు.
-అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తారా.?
- అధికార పక్షం చేతిలో చిత్తవుతారా .?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణతో విడిపోయిన తర్వాత మూడవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేసారు. రాష్ట్ర ఏర్పడిన మొదటిసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండవసారి ఎన్నికల్లో  జగన్మోహన్ రెడ్డి పార్టీ 151 సీట్లతో అద్భుతమైన మెజారిటీ సాధించింది. మూడవ సారి జరిగిన ఎన్నికల్లో  164 సీట్లతో అద్భుతమైన మెజారిటీతో  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు, కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇదే తరుణంలో  ఐదేళ్లు అధికారంలో ఉన్నటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  టిడిపిని ముప్పు తిప్పలు పెట్టింది. చివరికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడుని కూడా  దారుణంగా అవమానించింది. కనీస ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టి నేను మళ్ళీ సీఎం అయ్యేవరకు ఈ సభలో అడుగుపెట్టను అని శపథం చేశారు. ఆ విధంగానే ఆయన సీఎం అయ్యేవరకు సభలో అడుగు పెట్టలేదు. 


అలా చంద్రబాబు నాయుడును ఏడిపించడమే కాకుండా చివరికి జైలుకు కూడా పంపారు. ఇలా ఈ విధంగా రివెంజ్ తీసుకున్నటువంటి జగన్  కనీసం ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. ప్రస్తుతం టిడిపి కూటమికి అద్భుతమైనటువంటి మెజారిటీ ఉంది. వాళ్లు ఇప్పుడు జగన్ ను ఏడిపించడం కాదు ఏదైనా చేయవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు గెలిసిన మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా కొత్తవారే.  అందులో ఒకరిద్దరు తప్ప మిగతా ఎవరు కూడా అసెంబ్లీలో మాట్లాడే అంత టాలెంట్ ఉన్నవారు కాదు.  ఉన్న సీనియర్లు కూడా  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి అసెంబ్లీలో పెద్దగా ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవచ్చు.  దీంతో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏ విధమైన ప్రశ్నలు వేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రమే వేయాలి. ప్రతిపక్షంగా అన్నిటిని తన భుజాలపై మాత్రమే మోయాలి.  ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి, ఎలాంటి మాట వచ్చిన  అసెంబ్లీలో ఉన్నటువంటి టిడిపి సభ్యులంతా విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కొన్ని శాంతి భద్రతలు లోపించాయి. దీనిపై జగన్ మాట్లాడతారా లేదంటే సైలెంట్ గా ఉంటారా అనేది చూద్దాం.

ప్రధాన అస్త్రమే శాంతిభద్రతలు :
ప్రస్తుతం అసెంబ్లీలో అడుగు పెట్టనున్న జగన్ కు శాంతిభద్రతల అంశమే ప్రధాన అస్త్రంగా ఉంది. ముఖ్యంగా టిడిపి కూటమి గెలిచిన తర్వాత చాలామంది టిడిపి నాయకులు  అల్లర్లు చేయడం అధికారులపై విరుచుకుపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి.  అంతకాకుండా నాయకుల ఆస్తులపై దాడులు చేయడం, కనీసం పోలీసులు ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే మాత్రం రాష్ట్రంలో కాస్త శాంతిభద్రతలు గాడి తప్పయ్ అని చెప్పవచ్చు. ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ప్రశ్న జగన్మోహన్ నోటి నుంచి ఉత్పన్నం అయితే టిడిపి కుటుంబ సభ్యులు కౌంటర్ ఎలా ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: