ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు వేడి వేడిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉంటుంది. గవర్నర్ ప్రసంగంతో తొలి రోజు అసెంబ్లీ సమావేశం ముగియనుంది. ఇక ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్. ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనున్నారు గవర్నర్.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు.. గత ఐదేళ్ల పాలనను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అమరావతే ఏపీ రాజధాని అనే విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా స్పష్టం చేయనుంది ఏపీ ప్రభుత్వం. శాంతి భద్రతలకు హై ప్రయార్టీ, గంజాయి నివారణ వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక అటు వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సభకు రానున్నారు చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వైసీపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా రంటూ సభ బయట, లోపల నిరసనలు తెలిపేందుకు వైసీపీ ప్రణాళికలు చేస్తోంది. తొలి రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశం కాబట్టి సభలో వైసీపీ ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలవనున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీలు. పోడియం వద్ద నిరసనలకు తెలిపేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది వైసీపీ పార్టీ.

సభలో జరగని సీట్ల కేటాయింపు, సాధారణ సభ్యునిగానే సభలోకి రానున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ మేరకు తాడేపల్లి నుంచి ఉదయం 9.20 గంటలకు ప్రారంభం అవుతారు జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు. ఇక ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో...ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఈ తరుణంలోనే... ఏపీ అసెంబ్లీలో కూటమి సభ్యులనున జగన్‌ మోహన్‌ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: