* వైసీపీ పాలనలో దారుణంగా ఏపీ రోడ్లు
* గ్రామాల్లో అత్యంత దారుణంగా రోడ్లు
* రోడ్ల విషయంలో జగన్‌ ను దోషిగా చూపించే ప్రయత్నం
* బాబును దీటుగా ఎదుర్కొనేలా జగన్‌ స్కెచ్‌


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు రెండు వారాలపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ మేరకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. సోమవారం నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలలో అనేక కీలక చర్చలు జరగనున్నాయి.


శ్వేత పత్రాలు రిలీజ్ చేసి వైసిపిని ఎండగట్టే ప్రయత్నం చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా... ఆంధ్రప్రదేశ్ రోడ్లపై ప్రధాన చర్చ నిర్వహించబోతుంది ఈ చంద్రబాబు కూటమి సర్కార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలలో ఏపీ రోడ్లపై ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదని ఇప్పటికీ టాక్ ఉంది. గతంలో కేటీఆర్ అలాగే హరీష్ రావులు కూడా... ఇదే విషయాన్ని చెబుతూ.. తమ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు.


అంతే కాకుండా... ప్రెగ్నెంట్ లేడీ లు ఏపీ రోడ్లపై వెళ్తే... రోడ్ల పైనే డెలివరీ అవుతుందని.. కొంత మంది సెటైర్లు కూడా పేల్చారు. అయితే ఇదే అంశాన్ని అసెంబ్లీ సమావేశాలలో... ఎండగట్టబోతోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని దోషిగా చూపించే ప్రయత్నం కూడా చేసే ఛాన్స్ ఉంది.
 
ఏపీ రోడ్ల పరిస్థితి ఏంటి? ఐదేళ్లలో ఏపీ రోడ్లకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారు? గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి ఏంటి ? ఇలా అనేక ప్రశ్నలను అసెంబ్లీ వేదికగా...  వేసి జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏపీ రోడ్లపై జగన్మోహన్ రెడ్డి ఇలా సమాధానం ఇస్తారో చూడాలి. కాగా ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలకు జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: