•అసెంబ్లీలో జగన్ బ్యాక్ బెంచ్..

•ప్రతిపక్ష హోదా కూడా దక్కదా..

•అసెంబ్లీలో ఎదురయ్యే కష్టాలను జగన్ అధిగమిస్తారా..?


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈసారి అసెంబ్లీలో బ్యాక్ బెంచ్ ని కేటాయిస్తారని చర్చ కూటమిలో ఎక్కువగా వినిపిస్తోంది.  ఎందుకంటే ఇప్పటిదాకా అసెంబ్లీ స్పీకర్ సీట్లు కేటాయింపు జరగలేదని కూడా తెలియజేస్తున్నారు.  పైగా ప్రతిపక్ష హోదా అన్నది కూడా ఈసారి అసెంబ్లీలో లేదనే చర్చ కూడా మొదలయ్యింది.. హోదా ఇవ్వాలి అంటే మొత్తం 10% సీట్లు తెచ్చుకోవాలనే నిబంధన కూడా ఉందని తెలిపారు.. ఈ లెక్కన చూసుకుంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి కేవలం వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి.


దీంతో ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చేలా.. మొదటి వరుసలో సీట్లు ఇవ్వరని కూడా తెలియజేశారు. దీనికి అసెంబ్లీలో జగన్ ని ఒక సాధారణ ఎమ్మెల్యే గానే చూస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరొకవైపు చూస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం కూడా ఉన్నది కాబట్టి అపోజిషన్ గా గుర్తించాలంటూ స్పీకర్ కి ఒక లేఖ కూడా గతంలో జగన్ రాశారు. ఈ విషయం పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. దీని బట్టి చూస్తే వైసీపీకి ప్రతిపక్ష హోదా అనే గుర్తింపు కూడా లేకుండా పోతోంది.


ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పుడు వైసీపీ ఏ విధంగా వ్యవహరిస్తుందనే చర్చ అందరిలో మొదలయ్యింది. మొదటిరోజు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి ఇక్కడ సీట్లు కేటాయింపు సమస్య అసలు ఉండదు. అలాగే రెండవ రోజు నుంచే బిజినెస్ అడ్వైజర్ కమిటీ జరగబోతోంది. మరి ఈ విషయంలో వైసీపీ పార్టీకి ఆహ్వానం ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలి. మొత్తానికి ఈసారి చూసుకుంటే వైసీపీ పార్టీకి ఒక రకమైన సమస్యలు ఏర్పడేలా కనిపిస్తోంది.. మరి వీటన్నిటిని వైసీపీ పార్టీ ఎలా అధిగమించి ముందుకు వెళుతుంది.. రాబోయే ఎన్నికలలో తమ సత్తా చాటుతుందా లేకపోతే పరిస్థితి ఏంటో అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: