నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.  దీంతో ఏపీ లో అందరూ కూడా ఒకే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అని. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది వైసిపి. అయితే గెలిచిన వాళ్లలో కూడా సీనియర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. దీంతో 164 స్థానాలలో గెలిచిన అఖండమైన మెజారిటీతో ఉన్న టిడిపి జనసేన బీజేపీ కూటమిని ఎదుర్కొని అటు జూనియర్స్ తో కూడిన వైసిపి అటు అసెంబ్లీలో ఎలా వ్యవహరించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.


 అయితే ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే విషయంపై చర్చ జరుగుతుండగా.. ఒకవేళ జగన్ అసెంబ్లీకి వస్తే ఎలాంటి అంశాలను లేవనెత్తుతారు అన్న విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు. అయితే మొన్నటి వరకు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన జగన్.. ఒకవేళ ఇప్పుడు శాసనసభకు హాజరైతే మాత్రం ఒక్క విషయం గురించినోరు విప్పే అవకాశం లేదు అనేది తెలుస్తుంది. అదే పోలవరం ప్రాజెక్టు గతంలో 2019  ఎన్నికలకు ముందు జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. చంద్రబాబు పోలవరం విషయంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు.

 తమకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే పోలవరాన్ని కంప్లీట్ చేసి చూపిస్తాం అంటూ హామీ ఇచ్చారు. కానీ ఇక ఈ ఏడాది కంప్లీట్ అవుతుంది. ఈ ఏడాది కంప్లీట్ అవుతుంది అంటూ ఐదు సంవత్సరాలను గడిపేసారు. కానీ ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు. దానికి తోడు వ్యయం మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. ఇక మొన్నటికీ మొన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు జగన్ ప్రభుత్వం హయాంలో పోలవరం డిజైన్ అస్తవ్యస్తం చేశారని.. ఇక ఇప్పుడు దాన్ని సరి చేయడానికి మరింత ఖర్చు అవుతుందని చెప్పారు. ఇలాంటి సమయంలో పోలవరం గురించి జగన్ అసెంబ్లీ సమావేశాల్లో నోరు విప్పే అవకాశం లేదని నేను విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ జగన్ ఈ అంశాన్ని లేవనెత్తితే ఇక కూటమి ఎమ్మెల్యేలే అటు జగన్ పై విమర్శలతో విరుచుకుపడే అవకాశం ఉందని.. పోలవరం విషయంలో గత జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి మొత్తం ప్రస్తావనకు తెస్తూ ఇక జగన్ కు గట్టి కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే జగన్ ఇక పోలవరం విషయంపై ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం లేదు అని అనుకుంటున్నారు. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: