- త‌న‌తో పాటు పార్టీని కాపాడుకోవాలి...
- అప్పుడే ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ప‌క్క చూపులు
- గుంటూరు, విశాఖ‌ప‌ట్నం కార్పోరేష‌న్లు కూట‌మికే..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు అనేక తిప్పులు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. త‌న‌ను తాను కాపాడు కోవ‌డం ఒక లెక్క‌.. ఇప్పుడు పార్టీని, నాయకుల‌ను కూడా కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ పాల‌న జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. వాటిని సొంతం చేసుకునేందుకు కూట‌మి పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇప్ప‌టికే చిత్తూరు పాల‌న కూట‌మిలోని టీడీపీ,జ‌న‌సేన‌ల‌కు చేరి పోయింది. ఇక‌, ఇప్పుడు గుంటూరు, విశాఖ‌ప‌ట్నంపై కూట‌మి క‌న్నేసింది.


ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఈ రెండు కార్పొరేష‌న్లు కూడా..కూట‌మి వైపుక‌ద‌లిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితి నుంచి వైసీపీ ఆయా పాల‌న‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక‌, మ‌రోవైపు.. త్వ‌ర‌లోనే పార్ల మెంటు స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీకి ఉన్న 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల‌ను  చేర్చుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని.. పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌.. వంటి వారు జంప్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.


అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వెళ్ల‌క‌పోయినా.. మున్ముందు వెళ్ల‌బోర‌ని ఎక్క‌డా గ్యారెంటీ లేదు. పైగా.. జ‌గ‌న్ ఈ విష‌యంలో ఎదురీత ఎదుర్కొనే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుల‌పై బీజేపీ క‌నుక క‌న్నేస్తే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ. వైసీపీకి ఎదురు దెబ్బ‌త‌ప్ప‌దు. గ‌తంలో టీడీపీ నుంచి కొంద‌రు రాజ్య స‌భ స‌భ్యుల‌ను బీజేపీ విలీనం చేసుకుంది. ఇక‌, ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి అలా వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఇది కూడా జ‌గ‌న్‌కు తీవ్ర తిప్ప‌లుగా మార‌నుంది.


అసెంబ్లీ విష‌యానికి వ‌స్తే.. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. వీరిలో ఇద్ద‌రు టీడీపీవైపు చూస్తున్న‌ట్టు అంత‌ర్గ త చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఎందుకంటే.. పార్టీ పరంగా రేపు వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. జ‌గ‌న్‌ను ఇరుకున పెడితే.. త‌మ ప‌రిస్థితి ఏంట‌నికొంద‌రు ఆలోచ‌న చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లోకి వెళ్లార‌ని స‌మాచారం. వీరిని పార్టీలో చేర్చుకునే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది., త‌ద్వారా అసెంబ్లీలో వైసీపీని మ‌రింత ఇరుకున పెట్టొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: