- జ‌గ‌న్‌తో క‌లిసొచ్చేందుకు ఏ పార్టీ రెడీగా లేదే
- నెల రోజుల ప్ర‌భుత్వంపై ఢిల్లీ ధ‌ర్నా వృథా ప్ర‌యాసే
- జ‌గ‌న్‌ను తిట్టినోళ్లే ఇప్పుడు జ‌గ‌న్‌తో క‌లిసి రావాలే..

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఈ నెల 24న ఢిల్లీలో ధ‌ర్నాకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జ‌రుగుతు న్న అరాచ‌కాలు, విధ్వంసాలు, హ‌త్య‌ల వ్య‌వ‌హారాన్ని ఢిల్లీ వ‌ర‌కు వినిపించాల‌ని.. జ‌గ‌న్ నిర్ణ‌యించుకు న్నారు. ఈ విష‌యాన్ని జ‌గ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. క‌లిసివ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని పోవాల‌ని.. పిలుపు ఇవ్వాల‌ని కూడా వైసీపీ నాయ‌కుల‌కు జ‌గ‌న్ పిలుపునిచ్చారు. స‌రే.. ఎవ‌రు వైసీపీతో క‌లిసి వ‌స్తారు? ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబుపై యుద్ధం ఎవ‌రు చేస్తార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల‌ ప్ర‌శ్న‌.


ఎందుకంటే.. జ‌గ‌న్ తో క‌లిసి అడుగులు వేయ‌డం అంటే.. గ‌తంలో ఏ పార్టీలైతే.. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించాయో.. ఏ పార్టీలైతే.. జ‌గ‌న్ పాల‌న‌ను విధ్వంసం అంటూ ఎంగ‌ట్టాయో.. ఆ పార్టీలు ఇప్పుడు జ‌గ‌న్ వెంట రావాల్సి ఉంటుంది. సో.. ఎవ‌రూ దానికి సిద్ధంగా లేరు. పైగా.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల రోజులు మాత్ర‌మే అయింది. ఇంత‌లోనే.. ప్ర‌భుత్వంపై ఉద్య‌మిస్తే.. ప్ర‌భావం ఉండ‌ద‌ని.. దాని వ‌ల్ల త‌మ పార్టీల సింపతీ కూడా పోతుంద‌ని కొంద‌రు నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.


ఫ‌లితంగా తొలి ద‌శ‌లోనే జ‌గ‌న్ ఎదురు దెబ్బ తిన‌నున్నారు. ఏ పార్టీ కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చే అవ‌కా శం క‌నిపించ‌డం లేదు. ఇదొక మైన‌స్‌. ఇక‌, జ‌గ‌న్ ఢిల్లీలో ధ‌ర్నా చేసినా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ స‌ర్కారు ప‌ట్టించుకునే ప‌నిలేదు. ఎందుకంటే.. ఏపీలో నిజంగానే ఘోరాలు జ‌రుగుతున్నాయ‌ని అనుకు న్నా.. ఇంత‌క‌న్నా ఎక్కువ‌గా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జ‌రుగుతున్నాయి. సో.. వాటిని ముందు ప‌రిష్క‌రించ‌కుండా.. ఏపీపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం కేంద్రానికి ఉండ‌దు. అస‌లు శాంతి భ‌ద్ర‌త‌లు రాష్ట్రాల జాబితా. ఇదొక మ‌రో మైన‌స్‌.


ఇక‌, వ్య‌క్తిగ‌తంగా తీసుకున్నప్ప‌టికీ.. జ‌గ‌న్‌కు ఢిల్లీలో చేస్తున్న ధ‌ర్నాతో పెద్ద‌గా ఒరిగేది ఏమీ లేదు. ఎందు కంటే.. ఎవ‌రైనా కూడా నెల రోజులు కూడా కాని ప్ర‌భుత్వంపై ఇంత యాగీ చేయ‌డం ఎందుకు? అనే కోణం లోనే ఆలోచ‌న చేస్తారు త‌ప్ప‌.. జ‌గ‌న్ వైపు సింప‌తీ చూపించ‌రు. ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే.. గ‌త ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ ఎప్పుడైనా.. ప్ర‌తిప‌క్షాల మాట విని ఉంటే.. లేదా.. త‌న పాల‌న‌లో ఒక్క హ‌త్య కూడా జ‌ర‌గ‌కుండా ఉండి ఉంటే.. ఆయ‌న‌ను న‌మ్మేందుకు అవ‌కాశం ఉండేది. కానీ, సొంత బాబాయి కేసే జ‌గ‌న్‌ను వెంటాడుతున్న ద‌రిమిలా.. ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు ఢిల్లీ వెళ్లి ధ‌ర్నాలుచేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని అంటున్నారు మేధావులు.

మరింత సమాచారం తెలుసుకోండి: