- నిండుస‌భ మొత్తం లేచి రెస్పెక్ట్ ఇచ్చే స్టేజ్ టు జ‌స్ట్ ఎమ్మెల్యే
- 151 నాడు హీరో... నేడు 11తో జీరో
- టీడీపీ నేత‌ల ఈల‌లు, గోల‌ల మ‌ధ్య జ‌గ‌న్‌ది ఆర‌ణ్య రోద‌నే

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

కాల‌ర్ ఎగ‌రేసుకుని.. నిండు స‌భ మొత్తం లేచి నిల‌బ‌డి.. స్వాగ‌తం ప‌లుకుతున్న‌ట్టుగా న‌మ‌స్కారం చేసుకున్న ప‌రిస్థితిలో అడుగు పెట్టిన రోజు నుంచి నేడు.. న‌వ్వులు.. వెక్కిరింత‌లు.. ఏవ‌గింపు చూపుల స్వాగ‌తాల మ‌ధ్య స‌భ‌లో బిక్కు బిక్కు మంటూ.. అడుగు పెట్టాల్సిన ప‌రిస్థితి!!  విధి ఎలా ఉన్నా.. జ‌నం ఎంత చిత్ర‌మైన తీర్పు ఇచ్చారు. ఒక‌ప్పుడు 23 మందే గెలిచినా.. టీడీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అయినా.. ద‌క్కింది. కానీ, ఇప్పుడు అది అడుక్కున్నా ద‌క్క‌ని ప‌రిస్థితి నెల‌కొంది.


దీంతో వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి నిండు అసెంబ్లీలో ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారిం ది. ఒక‌ప్పుడు అంటే.. గ‌త ఐదేళ్లు కూడా.. నిండు ద‌ర‌హాసంతో మోరెత్తుకుని మ‌రీ స‌భ‌లోకి అడుగులు వేశారు. దీనికి కార‌ణం.. భూత భ‌విష్య‌త్తు, వ‌ర్త‌మాన కాలంలో 151 సీట్లు రాగ‌ల‌, తెచ్చుకోగ‌ల పార్టీ ఏకైక వైసీపీ మాత్ర‌మేన‌న్న ధోర‌ణిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. కానీ, ప్ర‌జాతీర్పు అస‌మంజ‌స స్పృహ‌ను అతలా కుత‌లం చేసి.. 151 నుంచి 11కు ప‌రిమితం చేసింది.


ఫ‌లితంగా ఇప్పుడు జ‌గ‌న్‌కు పెను సంక‌టం. అస‌లు సీటింగ్ ఎక్కడ ఉంటుందో.. ఎలా ఉంటుందో.. ఎటు వైపు కూర్చోనిస్తారో.. అనే ఇలా అనేక పీకులాట‌లు వెంటాడుతున్నాయి. గతంలో పూల‌మ్మిన చోటో ఇప్పు డు క‌ట్టెల‌మ్మాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నే ఆవేద‌న, ఆక్రంద‌న‌, ఆక్రోశం వంటివి ఆయ‌న‌ను వెంటాడుతు న్నాయి. ఎలా చూసుకున్నా.. స‌భా స‌మ‌రంలో జ‌గ‌న్‌కు ఇప్పుడు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామం  ఎదురు కానుంది. ప్ర‌జాస్వామ్యంలో నాయుకులు ఉత్థాన‌మే  కోరుకుంటారు. కానీ. ప‌త‌నం కూడా ఆవెంట‌నే ఉంటుంద‌న్న విష‌యం తెలియాలి.


ఇక, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు మ‌రో ఇబ్బంది కూడా ఉండ‌నుంది. ఆయ‌న‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా లేనందున‌.. మాట్లాడే స‌మయం విష‌యంలో ప్ర‌త్యేకంగా ఆయ‌న‌కు ఎలాంటి ప్రొవిజ‌న్సు వ‌ర్తించ‌వు. అదేవిధంగా గ‌తంలో వైసీపీ పాల‌న‌లో స‌భ‌లో ప్ర‌త్యేకంగా వీడియోల‌ద్వారా.. టీడీపీ పాల‌న‌ను ఎండ‌గ‌ట్టి న‌ట్టే.. ఇప్పుడు వైసీపీ పాల‌న‌ను కూడా ఎండ‌గ‌డ‌తారు. కామెంట్లు చేస్తారు. ఈల‌లు వేసినా.. గోల‌లు చేసినా ఆశ్చ‌ర్యం లేదు. సో.. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్‌కు సంక‌ట స్థితి-ప‌రిస్థితి త‌ప్ప‌వ‌నే వాద‌న వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: