ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... తెలుగుదేశం ప్రభుత్వం చాలా దూకుడుగా పని చేస్తుంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే...  వైసీపీ పార్టీ నేతల.. అవినీతిని బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.  అలాగే గతంలో తెలుగుదేశం, జనసేన  పార్టీలను టార్గెట్ చేసిన నేతలు.. గుర్తించి మరీ ప్రతి కారం తీర్చుకుంటుంది. కొంతమంది తెలుగుదేశం కూటమి నేతలు... నేరుగా వైసిపి నేతల ఇండ్లపై దాడులు కూడా చేస్తున్నారు.

అయితే ఇలాంటి నేపథ్యంలో... వైసిపి పార్టీ యువ నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.. నాగార్జున యాదవ్ కు ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా నాగార్జున యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి... ఏపీకి వస్తున్న నేపథ్యంలో... కడప దగ్గర పోలీసులు... నాగార్జున యాదవును అరెస్టు చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు అధికారిక ప్రకటన చేయనప్పటికీ... సోషల్ మీడియాలో మాత్రం వార్తలు వస్తున్నాయి.


అయితే... నాగార్జున యాదవ్ అరెస్టు వెనుక పెద్ద కారణమే ఉంది. కొన్ని రోజుల కిందట ఓ టీవీ చర్చలో.. నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. ఇప్పుడు అనేక మొదటి నుంచి నాగార్జున యాదవ్... టీవీ డిబేట్లో కూర్చొని... ఎడాపెడా మాట్లాడేస్తూనే ఉంటారు. అయితే ఓ డిబేట్లో కూర్చున్న నాగార్జున యాదవ్.... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారట.


దీనిపై...  తెలుగు యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి... వరుణ్ కుమార్ అనే వ్యక్తి.... పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్... పైన కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం.. అతన్ని.. కాపు కాసి మరీ కుప్పంలో అరెస్టు చేయడం జరిగింది. ఇక నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయగానే... ఆ కేసు కొట్టి వేయాలని... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైసిపి పార్టీ. ఇది ఇలా ఉండగా... నాగార్జునకు 41 సి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: