2024 ఎన్నికల్లో దారుణమైన ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పుంజుకోవడం సులువు కాదని ప్రచారం జరిగింది. జగన్ వ్యవహార శైలి కూడా ఒక విధంగా ఈ ప్రచారానికి కారణమని చెప్పవచ్చు. అయితే ఎన్నికల ఫలితాలతో షాకైన జగన్ నెమ్మదిగా మారుతున్నారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వాళ్ల మెప్పును పొందే విషయంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. జగన్ లో ఇంత మార్పు వస్తుందని కార్యకర్తలు కలలోనైనా ఊహించలేదు.
 
వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ఢిల్లీలో ధర్నా దిశగా అడుగులు, మీడియాతో జగన్ మమేకం అవుతూ ప్రశ్నలకు స్పందిస్తున్న తీరు, అసెంబ్లీ సమావేశాల్లో కూటమిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తూ జగన్ వేస్తున్న అడుగులు ఆయన సరైన దారిలోనే నడుస్తున్నారని ప్రజల్లో అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. కార్యకర్తల మెప్పుతో జగన్ సగం సక్సెస్ అయినట్టేనని చెప్పవచ్చు.
 
ప్రజల మెప్పు కూడా పొందితే జగన్ మిగతా సగం మెప్పు ప్రజల నుంచి పొందితే తిరుగుండదని చెప్పవచ్చు. వింటేజ్ జగన్ ను మళ్లీ చూస్తున్నామని కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. జగన్ ను చూస్తుంటే రాష్ట్రంలో మళ్లీ వైసీపీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఊరిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా జగన్ సత్వరమే స్పందించాల్సి ఉంది.
 
కూటమి తప్పులను ఎత్తిచూపే విషయంలో జగన్ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. జగన్ అపని అయిపోయిందని అనుకున్న తరుణంగా ఒకింత దూకుడుగా జగన్ వ్యవహరించడం పార్టీకి మేలు చేస్తోంది. జగన్ తీరుతో వైసీపీ శ్రేణులకు ధైర్యం వస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ రోడ్డెక్కడంతో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి నేతలు కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తూ విమర్శల పాలవుతుండటం కొసమెరుపు. ప్రజల్లో కూటమికి పెరుగుతున్న వ్యతిరేకతను వైసీపీ క్యాష్ చేసుకుంటుందేమో చూడాలి.
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: