ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తెలంగాణతో విడిపోయిన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.  ఇందులో మొదటిసారి ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ టైంలో టిడిపి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అదే రెండవసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో అద్భుత మెజారిటీ సాధించింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇక మూడవసారి జరిగిన ఎన్నికల్లో టిడిపి బిజెపి,జనసేన తో కూటమిగా ఏర్పడి 164 సీట్లతో విజయదుందుభి మోగించింది.  ఇక  నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడే ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే తరుణంలో వైసిపి పార్టీ దారుణమైన ఓటమిని చవిచూసింది. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.  దీంతో చాలామంది వైసిపి కిందిస్థాయి నాయకులు అంతా టిడిపి పార్టీలోకి వెళ్లాలని అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఒకవేళ టిడిపిలో ఛాన్స్ దొరకకపోతే జనసేనలో చేరాలని చూస్తున్నారు. ఇక వైసిపి హయాంలో ఐదు సంవత్సరాల పాటు చాలామంది కార్పొరేటర్లు,సర్పంచులు, ఎంపీటీసీలు పనులు చేసి దారుణంగా నష్టపోయారు. ఇంకా బిల్లులు అలాగే పెండింగ్లో ఉన్నాయి.  ఇదే తరుణంలో టిడిపి కూటమి గెలవడంతో వైసిపి లో ఉన్నటువంటి కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు బిల్లులు రాబట్టుకోవడానికి అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చివరికి టిడిపి పార్టీలో చేరాలి అని భావిస్తున్నారట.  అందుకే టీడీపీ లోకి ఒక ప్రవాహంలా కార్పొరేటర్ల చేరికలు వస్తున్నాయి. ఇలా టిడిపిలో చేరడం వల్ల  బిల్లులు వస్తాయి, అలాగే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గౌరవం ఉంటుంది.

ఏమైనా చిన్నాచితకా పనులు చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఆలోచన కూడా చేస్తున్నారట. వైసిపి చేసిన తప్పుల వల్ల  కొంతమంది కార్పొరేటర్లు బిల్లులు రాక అనేక అప్పుల పాలయ్యారు.  ఈ విషయాన్ని టిడిపి ఎమ్మెల్యేల ముందు చెప్పుకొని మీ పార్టీలోకి వస్తాం అని బ్రతిమిలాడి మరీ పార్టీలో చేరుతున్నారట. ఇలా ఏకపక్షంగా వైసిపి అంతా ఖాళీ అవుతూ  టిడిపి,జనసేన పార్టీలు నిండిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం రాబోవు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులే వస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: