తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఎక్కువ శాతం సినిమా నటులే... ముఖ్యమంత్రిగా ఎదుగుతున్నారు. కరుణానిధి నుంచి... జయలలిత అలాగే స్టాలిన్ కొడుకు ఉదయ్ వరకు చెప్పుకుంటే చాలా మంది... సినిమా స్టార్లే తమిళ రాష్ట్ర రాజకీయాలలో.. చక్రం తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు.. తమిళనాడు రాష్ట్రంలో... స్టార్ హీరో విజయ్ కూడా... గ్రాండ్ ఎంట్రీ చేశారు.

ఇటీవల తమిళగ వెంట్రికలగం అధ్యక్షుడు.. తమిళ స్టార్ హీరో  విజయ్... ఇప్పుడు తమిళ రాష్ట్ర రాజకీయాలలో..  కొత్త పద్ధతిని ఎంచుకోబోతున్నారు. త్వరలోనే పాదయాత్ర చేసి ఎందుకు సిద్ధమవుతున్నారు విజయ్. ఇప్పటివరకు తమిళనాడు రాష్ట్రంలో పాదయాత్ర ఎవరు చేయలేదు. కానీ విజయ్ మాత్రం పాదయాత్రతో తన పొలిటికల్ ఎంట్రీని.. ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.


2026 అసెంబ్లీ ఎన్నికల్లో... విజయమే లక్ష్యంగా.. విజయ్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసమే ఇప్పటినుంచి... పాదయాత్ర చేయబోతున్నారు. తమిళనాడులో ఉన్న వంద నియోజకవర్గాలను కలుపుతూ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు విజయ్. ఉదయనిది స్టాలిన్... అతి త్వరలోనే తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి..  చేపట్టబోతున్న నేపథ్యంలో.. ఇటు విజయ్ కూడా... రంగంలోకి దిగుతున్నారు.


ఇది ఇలా ఉండగా ఇప్పటికే తమ పార్టీకి సంబంధించిన జెండాతో పాటు ఎన్నికల గుర్తును.. కేటాయించుకునే ప్రయత్నంలో విజయ్ ఉన్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల సంఘాన్ని కూడా కలిశారట విజయ్. ఎన్నికల కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత... పార్టీని మరింత డెవలప్ చేయనున్నారట. గ్రౌండ్ స్థాయిలో పార్టీని తీసుకు వెళ్లేందుకు విజయ్ సిద్ధమవుతున్నారట. ఇక పద్ధతిగా పాదయాత్ర నిర్వ హించాలని.. దానికోసం ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసం...  నుంచి ప్రారంభించాలని విజయ్ అనుకుంటున్నారట. ఈ మేరకు తన స న్నిహితులు అలాగే పార్టీ కార్యకర్తలతో కూడా చర్చించారట విజయ్. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు వార్తలు వ స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: