ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు టీడీపీకి ఛాన్స్ దక్కితే 2019 నుంచి 2024 వరకు వైసీపీకి ఛాన్స్ దక్కింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీకి 2024 ఎన్నికల్లో వైసీపీకి షాకిచ్చే ఫలితాలు వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఏపీలో తమిళనాడు తరహా రాజకీయాలు జరుగుతున్నాయని ఐదేళ్లకు ఒక పార్టీకి ప్రజలు ఛాన్స్ ఇవ్వనున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
అసెంబ్లీ సమావేశాల సమయంలో ఢిల్లీలో ధర్నా చేయడం ద్వారా వైసీపీ కొత్త నాటకానికి తెర లేపుతోందని టీడీపీ అనుకూల పత్రిక పేర్కొంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి జగన్ సైతం అలానే ఫీలయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కాకుండా ఢిల్లీలో ధర్నాలు చేయడం సరైన నిర్ణయం అనిపించుకోదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
గవర్నర్ ప్రసంగానికి జగన్ ధన్యవాదాలను తెలియజేయడంతో పాటు కూటమి రిలీజ్ చేసే శ్వేత పత్రాలకు సంబంధించి జగన్ నుంచి సరైన కౌంటర్ వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ తమ సమాధానాలను వెల్లడించి ఆ సమాధానాలు సంతృప్తికరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వైసీపీ సరైన జవాబులు ఇవ్వలేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.
 
వైసీపీకి ప్రస్తుతం కుటుంబ సభ్యుల మద్దతు సైతం లేకపోవడంతో జగన్ కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ కూటమి తప్పులను ఎత్తి చూపడంలో పూర్తిస్థాయిలో సక్సెస్ సాధిస్తే మాత్రం పార్టీకి ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. 40 శాతం ఓటు బ్యాంక్ ఉండటం వైసీపీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం జగన్ నల్ల కండువాతో హాజరు కానుండటం కొసమెరుపు. జగన్ నల్ల కండువా ధరించడంపై కూటమి రియాక్షన్ ఎలా ఉండనుందో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: