ఎక్కడైనా సరే రాజకీయాలు అనేవి సాయంత్రం ఒకలా  ఉదయం ఒకలాగా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఒకే నియోజవర్గంలో ప్రత్యర్థిగా పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల వరకు ఎక్కువగా పోరాడిన ఎన్నికల తర్వాత కొందరు చాటు స్నేహంతో కొనసాగిస్తూ ఉంటారు.. ఇది ఆంధ్రాలో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏది ఉన్నా కూడా కొన్ని నియోజవర్గాలలో పరిస్థితి మాత్రం చాలా సాఫీగానే ఉంటుంది. ఇప్పుడు ఏపీలో కూటమితో భాగంగా బిజెపి టిడిపి టిడిపి నేతల మధ్య తెరచాటు దూరం పెద్దగా పెరుగుతోందని కనిపిస్తోంది.



ఈ ఏడాది జరిగిన ఎన్నికల ముందు బిజెపితో టిడిపి బాగానే జత కట్టింది. ఏకంగా 10 అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాలకు కూడా అప్పగించింది. మోడీతో కలిసి చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో బిజెపి నాయకులకు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ కు అవకాశం ఇచ్చారు. మరి ఇదంతా బాగా ఉన్న అసలు దూరం ఏంటి అనే చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలలో మారింది. రెండు కీలక విషయాలను టిడిపి బిజెపి రాష్ట్ర నేతల మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతోందట.


ఒకటి ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో బిజెపి నేతలు సైలెంట్ గా ఉండడం.. నేరుగా పార్టీ రాష్ట్ర పురందేశ్వరి కూడా తనకు ఈ హామీలకు ఎలాంటి సంబంధం లేదని కూడా తేల్చి చెప్పింది. ఇది కొంతవరకు టిడిపిలో చర్చనీయాంశంగా కూడా మారింది. ఇందులో కొన్ని పథకాలు అమలు కాకపోవచ్చు లేదా మరే కారణమైన ఉండవచ్చు కానీ తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా కేంద్ర స్థాయిలో సర్కార్ తెలియజేసింది. మరొక అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కేంద్ర నిధులను కూడా తెచ్చుకునేందుకు త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కేటాయింపు విషయంలో కూడా ఏపీకి ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడలేదని వాదన కూడా వినిపిస్తోంది. దీంతో బీజేపీ వ్యవహారం పైన టిడిపిలో కొంత ఆవేదన ఆందోళన కూడా కనిపిస్తోందట. ఈ వ్యవహారాన్ని మొత్తం జనసేన, టిడిపి నేతల మీదనే భారం వేశారు చంద్రబాబు బీజేపీ పార్టీని పట్టించుకోలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: