ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం10 గం.ప్రారంభమయ్యాయి.మొదటి రోజు గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభ వాయిదా అనంతరం స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ - బీఏసీ సమావేశం జరగనుంది. ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈనెల 26 వరకు అంటే 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశముంది.ఈ సమావేశాల్లోనే ఓటాన్ అకౌంట్ బడ్జె్ట్‌తో పాటుగా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అలాగే మూడు శ్వేతపత్రాలను టీడీపీ కూటమి ప్రభుత్వం విడుదల చేయనుంది. అటు వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న మరణకాండ, అత్యాచారాల గూర్చి గళం విప్పడానికి జగన్ తన మినీ సైన్యంతో నల్ల కండువా కట్టుకొని అసెంబ్లీ వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నల్ల కండువాళ్ళతో అసెంబ్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వైసిపి నేతల వద్ద ఉన్న పేపర్లు లాక్కొని పోలీసులు చించేసారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేయడానికి కాదని, ప్రజాస్వామ్యం కాపాడడానికి ఉన్నారని జగన్ పేర్కొన్నారు.024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్.. స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాసినా స్పందన లేదు. వైసీపీకి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే ఆ పార్టీ సభ్యులకు అసెంబ్లీలో స్థిరమైన స్థానాలను ఇప్పటి వరకూ కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ శాసనసభకు వచ్చినప్పటికీ మొదటి వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సాధారణ ఎమ్మెల్యేగానే వైఎస్ జగన్.. ఎక్కడో ఓ చోట కూర్చోవాల్సి ఉంటుందంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా.. వస్తే ఎక్కడ కూర్చుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: