ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజున మొదలయ్యాయి తొలి రోజు అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది.. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు చాలా క్షీణించాయి అంటూ వైసీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలలో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు బ్యాడ్జీలతో పాటు వైసిపి నేతలు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు.. దీంతో పాటుగా జగన్ నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ అని నినాదాలు కూడా చేస్తూ ముందుకు వెళ్లడం జరిగింది వైసిపి నేతలు. దీంతో వైసిపి సభ్యులను అసెంబ్లీ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకోవడంతోపాటు అక్కడి నుంచే ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది.


అయితే ఈ సమయంలోనే వైసీపీ నేతలు పట్టుకున్న ప్లకార్డులను పోలీసులు లాగేసుకొని మరి చించి వేయడం జరిగింది దీంతో ఒక సారిగా పోలీసుల తీరుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు.. వైయస్ జగన్ మాట్లాడుతూ అధికారం ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యము అంటూ తెలిపారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో అడ్డుకోవడం కూడా జరిగిందట.


ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ రోజున ఏపీ అసెంబ్లీ సమావేశాలలో తెలియజేశారు. అలాగే చంద్రబాబు ఒక విజనరీ నాయకుడు అంటూ తెలిపారు. విభజనల వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం వాటిల్లింది అంటూ హైదరాబాద్ రాజధానిని కోల్పోయామంటూ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక రాజధాని నిర్మాణానికి చాలా కృషి పడ్డారు 2014- 19 మధ్యలో పెట్టుబడులు బాగానే కొనసాగాయి.. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలు నష్టపోయాయి అంటూ ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు.. మార్పు రావాలని కోరుకున్నారు అందుకే కూటమిని గెలిపించారు అంటూ తెలిపారు గవర్నర్.. అయితే ఈ విషయాలు విన్న తర్వాత వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు ..ముఖ్యంగా ఇది గవర్నర్ ప్రసంగమా లేకపోతే కూటమి పాంప్లెట్ అన్నట్లుగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది అంటు కొనియాడారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: