గంటా శ్రీనివాసరావు రాజకీయంగా వేసే ఎత్తులు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆయన.. ఈసారి కూడా ప్రభుత్వం వస్తే కచ్చితంగా మంత్రి అవుతానని ఆశలు పెట్టుకున్నారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు.. గంటా యాక్టివ్‌గా లేరు. చివరకు లోకేష్, చంద్రబాబు విశాఖపట్నంకు వెళ్ళినప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు వారిని కలిసేందుకు ఇష్టపడలేదు. అందుకే ప్రభుత్వం ఏర్పడ్డాక గంటా వియ్యంకుడు నారాయణకు మంత్రి పదవి ఇచ్చారు తప్ప.. గంటకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో లోకేష్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు.


అందుకే గంటాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. గంట యాక్టివ్‌గా ఉంటున్నారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యేలను.. వైసీపీ సీనియర్ నేతలను.. టీడీపీ గుటికి చేర్పించే పనిలో గంటా బిజీగా ఉన్నారు. ఇక టీడీపీకి దాదాపు నాలుగు దశాబ్దాలుగా విశాఖ కార్పొరేష‌న్ టీడీపీకి అందటం లేదు. ఎప్పుడో 1987లో ఒకే ఒకసారి టీడీపీ విశాఖ మేయర్ పీఠం మీద కూర్చుంది. ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ వరుసగా మూడుసార్లు గెలిస్తే.. వైసీపీ ఒకసారి గెలిచింది. దీంతో విశాఖ మేయర్ పీఠం టిడిపికి ఒక కలగా మారింది. గంటా ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు.


14 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కూటమి వైపు వచ్చేశారు. ఒకప్పుడు గంటా ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్‌లో మొత్తానికి అందరు కార్పొరేటర్లు వైసీపీ పరం అయ్యారు. అప్పుడు గంటా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపించాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గంటా చక్రం తిప్పి అదే ఉత్తర నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్పొరేటర్‌లను టీడీపీ వైపు లాగేశారు. ఓవ‌రాల్ గా త్వరలోనే విశాఖ మేయ‌ర్‌ పీఠంపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసేందుకు.. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత ఎలాగైనా మంత్రి పదవి సొంతం చేసుకోవాలన్నదే గంటా టార్గెట్గా కనిపిస్తోంది. మ‌రి లోకేష్‌, బాబు గంటా బుట్ట‌లో ప‌డ‌తారా ?  లేదా గ‌త ఐదేళ్ల గంటా యాట్యిట్యూడ్ గుర్తు పెట్టుకుంటారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: