పైకి చూస్తుంటే వైసీపీ అధినేత వైయస్ జగన్ రెడ్డి కాంగ్రెస్‌కు తన తాను బద్ధ శత్రువుగా ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మోడీకి అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తూ ఉంటారు. మోడీకి వ్యతిరేకంగా వెళితే ఏమవుతుందో జగన్‌కు బాగా తెలుసు. మోడీకి వ్యతిరేకంగా లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ ఒక్క కామెంట్ కూడా చేయరు. అదే జరిగితే జగన్ వెంటనే జైలుకెళ్ళి పోవాల్సి ఉంటుంది. పైకి మోడీకి దగ్గరగా ఉన్నట్టు నటిస్తూనే.. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ.. ఈ పదేళ్లు కాలం గడుపుతూ వచ్చారు జగన్ రెడ్డి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. కేంద్రంలోనూ జనసేన, తెలుగుదేశం, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నాయి.


ఇప్పుడు బీజేపీ నుంచి తనకు ఎలాంటి సహకారం ఉండదని డిసైడ్ అయిన జగన్.. కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా వైసీపీకి మైలేజ్ ఇచ్చేందుకు జగన్‌ను తన వైపునకు తిప్పుకునేందుకు.. చాలా కష్టపడుతోంది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీయూ బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్ చేస్తే .. ఏపీకి ప్రత్యేక హోదాను విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కానీ.. ఈ విషయంలో టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అడగలేదని.. కాంగ్రెస్ కీలక నేత జయరాం రమేష్ ట్విట్ చేశారు.


ఇది పక్కాగా వైసీపీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉంది. బీజేపీకి అన్నిసార్లు సహకరించింది. పైగా రాజ్యసభలో చాలాసార్లు షరతులు లేని మద్దతు ఇచ్చింది. అయినా ఒకసారి కూడా వైసీపీ ప్రత్యేక హోదా అడగలేదు. ఇప్పుడు కూడా బహిరంగ వేదికల మీద అడగలేదు. కానీ వైసీపీ కంటే ముందే కాంగ్రెస్ నేతలు వైసిపి ప్రత్యేక హోదా అడిగిందని ప్రచారం ప్రారంభించారు. ఏది ఏమైనా జగన్ దీనస్థితి చూసి జాలిపడి.. కాంగ్రెస్ జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటుందా..? లేదా..? జగన్ కూడా తన దినస్థితి చూసి తనకు కాంగ్రెస్ గతి అని డిసైడ్ అయ్యారా..? అన్నది వారిద్దరికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: