దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య అక్రమ సంబంధం ఆరోపణలు తెలుగు మీడియాను, తెలుగు సోషల్ మీడియాను ఎంతలా వేడెక్కించాయో చూసాం. తాజాగా సస్పెన్షన్‌లో ఉన్న దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి ప్రెస్‌మీట్ పెట్టి చేసిన ప్రకటనలు ఇప్పుడు ఆమెను మరింత చిక్కుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే శాంతి పై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉండడంతో సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా ఆమెకు మరోసారి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక మీడియా సమావేశంలో ఆమె చేసిన ప్రకటనలకు ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారానికి ఎంత మాత్రం పొంతన లేదు.


ఇక శాంతి 2016 లోనే తన మొదటి భర్త మదన్మోహన్ మానిపాటికి విడాకులు ఇచ్చానని.. అప్పటికే తమకు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని.. తాను 2020 లాయర్ సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ ఆమె ఉద్యోగంలో చేరిన 2020లో తన భర్త మదన్ మోహన్ అని ప్రభుత్వానికి చెప్పారు. అలాగే గతేడాది ప్రసూతి సెలవులకు వెళ్ళినప్పుడు కూడా చేసిన దరఖాస్తులు తన భర్త పేరు మదన్మోహన్ అని చెప్పారు. కానీ ప్రెస్‌మీట్‌లో మాత్రం తన భర్త సుభాష్ రెడ్డి అని చెప్పారు. ఇలా ఓ పెళ్లితో విడాకులు కాకుండానే మరో పెళ్లి చేసుకోవడం నేరం. సర్వీస్ నిబంధనలకు విరుద్ధం కూడా.


దీనిపై సమాధానం చెప్పాలని ప్రభుత్వం శాంతికి ఇచ్చిన నోటీసులలో పేర్కొంది. ఇది ఇలా ఉంటే శాంతి ప్రభుత్వ ఉద్యోగి ఆమె మీడియాతో మాట్లాడాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ విషయంలో శాంతి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా శాంతి వ్యవహారం ముందు నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఆమె ఓ అధికారిపై ఇసుక చల్లడం దగ్గర నుంచి నివాసం ఉండే అపార్ట్మెంట్లో తోటి వారితో గొడవ పడటం వరకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆమె అధికారిగా ఉండగా దేవాదాయ శాఖల భూముల లీజులు, దుకాణాల లీజులు వ్యవహారంలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: