( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ . )

ఏపీలో ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత.. మాజీ హోం మంత్రి తానేటి వనిత మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తాజాగా హోం మంత్రి అనిత.. వినుకొండ ఘటన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే అంటూ అనిత సెటైర్లు వేయటం తెలిసిందే. దీనిని మాజీ హోంమంత్రి తానేటి వనిత తప్పుపట్టారు. అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన తరువాతే పదవులు చేపడతారని అన్నారు. చంద్రబాబు కుప్పానికి ఎమ్మెల్యే నా కాదా ? అని తానేటి వనిత స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చారు.


ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా.. మరో ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి విశేష ప్రజాదరణ ఉన్న జగన్‌ని.. నోటికి ఎంత వస్తే అంత మాట అంటారా అని అనిత మీద వనిత విమర్శలు గుప్పించారు. అనిత ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నారు అని.. తాను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాను అనుకుని మాట్లాడుతున్నారని.. మాట్లాడే విషయంలో స్పష్టత ఉండాలని.. అలాగే సభ్యత పాటించాలని సూచించారు. గత 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న మరణకాండకు అనిత ఏమని సమాధానం ఇస్తారో చెప్పాలని కూడా తానేటి వనిత ప్రశ్నించారు.


ఏపీలో వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం నుంచి వైసీపీ కార్యకర్తల మీద కొనసాగుతున్న హత్యాకాండ.. ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రంలో.. లా అండ్‌ ఆర్డర్ కంట్రోల్లో ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని కూడా వనిత చెప్పారు. ఇక అంతకుముందు తానేటి వనిత వరుసగా ప్రెస్‌మీట్లు పెడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో పాటు జగన్ పాలనలో జరిగిన అరాచకాలను వరుసపెట్టి ప్రజల ముందు ఉంచుతున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వానికి గట్టిగా ఆన్సర్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నారు. మరి 11 మంది ఎమ్మెల్యేలతో అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: