ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర... అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టిడిపి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి.... పక్కపక్కనే కూర్చున్నారట. దింతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ.. గవర్నర్ ప్రసంగించారు. అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ గవర్నర్. ఇలాంటి నేపథ్యంలో... ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డి అలాగే రఘురామకృష్ణ రాజు ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారట.


ఇద్దరి మధ్య కాసేపు మాటా మంతి కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మొదటగా జగన్ వద్దకు... టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెళ్లినట్లు సమాచారం. జగన్ దగ్గర కూర్చొని.. చెవిలో ఏదో మాట్లాడారట రఘురామకృష్ణరాజు. ఎవరికి వినిపించకుండా గుసగుస పెట్టారట. అయితే రఘురామా కృష్ణరాజు.. పెట్టిన గుసగుసకు జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లు.. ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి.


ఇక ఈ పరిణామం నేపథ్యంలో.. ఏపీ రాజకీయాలలో కొత్త చర్చ మొదలైంది. ఇది ఇలా ఉండగా... జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పుడు... రఘురామకృష్ణరాజు వైసిపి లోనే ఉన్నారు. కానీ ఎంపీగా గెలిచిన తర్వాత...  ఆ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు అరెస్టు రావడం.. టిడిపి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పై... రఘురామ కేసు పెట్టాడు కూడా జరిగిపోయింది. ఈ తరుణంలోనే.. జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ పోలీసులు కేసు కూడా పెట్టారు. ఈ కేసు లో ఏ 3 నిందితుడిగా జగన్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: