రిజర్వేషన్.. ఈ పద్ధతి ఎప్పుడైతే మొదలైందో ఇక చాలా మంది ప్రతిభావంతులు వెనుకబడి పోతున్నారని చెప్పవచ్చు. రిజర్వేషన్ల కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ మెరిట్ వచ్చినా సరే ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారుతూ ఏదో ఒక పని చేసుకుంటూ కెరీర్ను కొనసాగిస్తుంది యువత. అంతేకాదు ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు పడకుండా భవిష్యత్తును కొనసాగించవచ్చు అని ఆలోచించి, రోజులకు తరబడి రోజులు కష్టపడి చదివిన వారందరూ మెరిట్ సాధించుకున్నప్పటికీ కూడా రిజర్వేషన్ల కారణంగా ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లు తొలగించాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ విషయంపై ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉండడం బాధాకరం.. అయితే తాజాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీసుకున్న సంచలన నిర్ణయానికి యువత సంతోషం వ్యక్తం చేస్తోంది.

తాజాగా రిజర్వేషన్ల పద్ధతిని ఎత్తివేస్తూ మెరిట్ తోనే ఇకపై ఉద్యోగాలు అందిస్తామని చెప్పి సంచలన తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..ప్రభుత్వ ఉద్యోగాలలో స్వాతంత్ర్య సమరయోధుల కోటను ఐదు శాతానికి తగ్గించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అక్కడి సుప్రీంకోర్టు ఆదేశించింది. 93% నియామకాలను కేవలం మెరిట్ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన రెండు శాతం లో ఒక శాతం లో ట్రాన్స్ జెండర్లకు , దివ్యాంగులకు,  మరొక శాతం గిరిజనులకు కేటాయించాలని స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తూ .. ఈ మేరకు విద్యార్థి సంఘాల నేతలకు స్టూడెంట్ లకు పలు సూచనలు చేసింది. రోడ్లపైకి వచ్చి ఎవరు నిరసనలు చేపట్టొద్దని , వెంటనే క్లాసులకు హాజరు కావాలని సూచించింది.

ఇక తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు కూడా 56% నుంచి ఏకంగా ఏడు శాతానికి తగ్గింది. ఇద్దరు స్టూడెంట్లు రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ పై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదివారం అత్యవసరంగా విచారణ చేపట్టి ప్రభుత్వానికి ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి అయితే రిజర్వేషన్ల ఆధారంగా కాకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తామని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం పై విద్యార్థి సంఘాలు కాస్త చల్లబడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: