కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు విజయవంతంగా స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ... ఇరు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. గత ప్రభుత్వ పాలన కూడా దీనికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు... అందుకే నేడు ఆంధ్రా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నాం. 2014- 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయి.. 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగింది కానీ 2019లో అధికార మార్పిడి జరిగిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారు.

గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయి, సంస్థలు తరలిపోయాయని తన ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రస్తావించారు. దాంతో ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56% తగ్గించారు.. రోడ్లు, భవనాలపై వ్యయం 80 శాతానికి పైగా తగ్గించేశారని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానులన్నారు .. గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ మారింది. 2019-24 మధ్య ఏపీ ఇంధన రంగానికి రూ.1,29,503 కోట్ల నష్టం జరిగింది అని బాధపడ్డారు.

అదే విధంగా అస్తవ్యస్త ఇసుక విధానంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని వాపోయారు. నాణ్యత లేని మద్యం, గుర్తింపులేని బ్రాండ్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు. ఈ క్రమంలో కొన్ని వేలమంది మందుబాబులు కుటుంబాలు నాశనం అయ్యాయని దుయ్యబట్టారు. ఇలా మొత్తంగా వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అంటూ ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు చేసే పనిలో ఉన్నామని, సూపర్‌సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం.. అంటూ మాట్లాడడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: