ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాజకీయాలు ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ అత్యవసర విచారణ కూడా జరిపించాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ అగ్ని ప్రమాదం పైన రాజకీయ అనుమానాలు కూడా ఉన్నాయని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి..


అయితే ఇది అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే కుట్రపూరితంగా అని అంశంలో విచారణ జరిపించాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పలు రకాల ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది.. అయితే ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే భూములకు సంబంధించిన కీలక ఫైల్స్ సైతం కాల్చివేసారని ఆరోపణలు కూడా చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఈ విషయం పైన స్పందించారు. అయితే వెంటనే సంఘటన స్థలానికి సంబంధించి ఎలిఫ్కార్టర్లు డిజీపిని వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.


దీంతో డిజిపి ద్వారక తిరుమలరావుకు సీఎం చంద్రబాబు నుంచి ఉత్తర్వులు రాగానే వెంటనే మదనపల్లికి డీజీపీ సిఐడి చీఫ్ బయలుదేరబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మంటలు చెల్లారేగడంతో ఫైర్ సిబ్బందికి  సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి హుటాహుటిగా సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆ మంటలను కూడా ఆర్పి వేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన పోలీస్ కేసు నమోదు అయి మరి విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ భూములకు సంబంధించి కీలక ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగానే కాల్చివేశారా లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అనే విషయం పైన జరపాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే చంద్రబాబు మరొక పక్క ఇలాంటి సంఘటన పైన దృష్టి పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: