అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గత అర్థరాత్రి కార్యాలయంలో ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. ఆఫీసులోని అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20కి పైగా కంప్యూటర్లు ఇంకా పలు ఫైల్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో ఆ మంటలను అర్పి పరిస్థితిని అదుపులోకి తీసుకుచ్చారు. అయితే విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అక్కడ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదాన్ని ప్రభుత్వం జరిగిన సీరియస్‌గా తీసుకుంది. మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంపై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి హెలికాప్టర్‌లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలని జారీ చేశారు.దీంతో డీజీపీ ఇంకా సీఐడీ చీఫ్‌ మదనపల్లెకు బయలుదేరారు. 


అగ్నిప్రమాదంలో కీలక దస్త్రాలు కాలిపోయినట్లు సమాచారం తెలుస్తుంది. కొత్త సబ్‌కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలనేవి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది నిజంగా అగ్నిప్రమాదమా? లేదా కుట్రపూరితంగా జరిగిందా అనే అంశంపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగులబెట్టారని అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదంపై చంద్ర బాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకు సీఎస్‌ నీరభ్ కుమార్‌ ప్రసాద్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేశ్‌ చంద్ర లడ్హా హాజరవ్వడం జరిగింది. అగ్నిప్రమాదంలో అసైన్డ్‌ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్‌ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అధికారులని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశించడం జరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: